Peepal Leaves: మన హిందూ సంస్కృతిలో కొన్ని రకాల చెట్లను దైవంతో సమానంగా భావించి పూజలు చేస్తారు. అలా పూజలు చేసే మొక్కలలో రావి చెట్టు కూడా ఒకటి. హిందూ సంప్రదాయంలో రావి చెట్టుకు ఎంతో విశిష్టత ఉంది. రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపమని భావిస్తారు అలాగే ఈ చెట్టు కార్డు నుంచి మొదలుకొని కొమ్మలు ఆకులలో సకల దేవతలు కొలువై ఉంటారని భావిస్తారు అందుకే రావి చెట్టును పూజించడం వల్ల సకల దేవతల ఆశీర్వాదాలు మనపై ఉంటాయని విశ్వసిస్తారు. ఇలా రావి చెట్టును సాక్షాత్తు దైవ స్వరూపంగా భావించటం వల్లే కార్యక్రమాలలో కూడా రావి ఆకులను ఉపయోగిస్తారు.
రావి చెట్టును పూజించటం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా రావి ఆకులతో పూజ చేయడం వల్ల దోషాలు తొలగిపోయి ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి. రావి ఆకులతో ఎలా పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. రావి చెట్టును పూజించటం వల్ల శాపాలు, దోషాలు, పూర్వ జన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు. రావి చెట్టును పూజించడమే కాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను ఉంచి వాటిపై దీపం వెలిగించడం ద్వారా శాప, దోష, కర్మ ఫలితాలు తొలగిపోతాయి. అలాగే పూర్వ జన్మల పాపాల నుండి కూడా విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
Peepal Leaves:
ప్రతిరోజు ఉదయం ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేసిన అనంతరం మన ఇంట్లో దేవుడి గదిలో రావి ఆకులను శుభ్రంగా కడిగి ఉంచి అందులో మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనె వేసి దీపారాధన చేయాలి. ఇలా దీపారాధన చేయటం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు మాత్రమే కాకుండా పూర్వజన్మ పాపాల నుంచి కూడా విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు. ప్రతిరోజు ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఇక శనివారం సాయంత్రం నువ్వుల నూనెతో రావి చెట్టు ముందు దీపారాధన చేసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి రావటం వల్ల కూడా శని దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.