Papaya: బొప్పాయి తినడానికి ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కూడా ఈ బొప్పాయి చెట్టు ఉంటుంది ఇలా బొప్పాయి అందరికీ అందుబాటులో ఉండే పండు అని చెప్పాలి.ఇక బొప్పాయిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి అలాగే ప్రోటీన్స్ విటమిన్స్ ఫైబర్ వంటిపోషక విలువలు కలిగి ఉన్నటువంటి ఈ బొప్పాయిని ప్రతిరోజు తినటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం మన సొంతం చేసుకోవచ్చు.అయితే బాగా పండిన బొప్పాయి తరచూ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందటమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.
ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ బొప్పాయిని తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని లేకపోతే పెద్ద ఎత్తున ప్రమాదాలు ఏర్పడి పరిస్థితులు కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.బొప్పాయిని ఎప్పుడూ కూడా మనం ఆహారంతో పాటు కలిపి తీసుకోకూడదు అలా తీసుకోవడం వల్ల అది విషంలా మారుతుంది. ఇకపోతే చాలామంది సలాడ్స్ చేసుకునే సమయంలో బొప్పాయిని కూడా మిక్స్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా సలాడ్స్ తయారు చేసే సమయంలో మనం నిమ్మకాయను కూడా వేస్తుంటాము.
Papaya:
ఇలా సలాడ్స్ చేసే సమయంలో బొప్పాయి కలిపి అందులోకి నిమ్మకాయ వేయటం వల్ల అది విషం కన్నా ప్రమాదంగా మారే పరిస్థితి ఉంటుంది అందుకే ఎప్పుడూ కూడా వీటిని కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా నిమ్మకాయతో కలిపిన బొప్పాయి తినడం వల్ల రక్తహీనత, హిమోగ్లోబిన్ అసమతుల్యతలకి దారితీస్తుంది. పిల్లలకి, పెద్దలకి కూడా ఇది ప్రమాదమే. కాబట్టి ఈ పొరపాటు చేయొద్దు. బొప్పాయిని ఎప్పుడూ కూడా ఒక కప్ లేదా మూడు సన్నని బొప్పాయి ముక్కలు తింటే అందులో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలన్నింటిని మనం పొందవచ్చు.