Kiara Advani: బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకొని దూసుకుపోతున్న అందాల భామ కియరా అద్వానీ. ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది.
ఓ వైపు హిందీలో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తెలుగులో రామ్ చరణ్ కి జోడీగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఈ మూవీ తర్వాత కియరా అద్వానీ ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గత నెల ఆరంభంలో కియరా అద్వానీ సిద్దార్ద్ మల్హోత్రా పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో వారిద్దరి ఇన్ని రోజులు కొత్త జీవితం హడావిడిలో ఉన్నారు. మరల రెండు రోజుల క్రితం కియరా అద్వానీ మ్యాకప్ వేసుకొని కెమెరా ముందుకి వచ్చింది. యాడ్ షూటింగ్ లతో మళ్ళీ రెడీ అయ్యింది. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత కూడా కియరా అద్వానీ ఏ మాత్రం తగ్గకుండా అందాల ప్రదర్శనకి రెడీ కావడం విశేషం.
తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ లాంగ్ ఫ్రాగ్ లో అదిరిపోయే లుక్స్ తో అందాల ప్రదర్శన చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్థాయిలో అందంతో మెరిసిపోతూ ఉంటే కియరా అద్వానీని తట్టుకోవడం కష్టమే అనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తుంది. అందాలని ఆరబోస్తూ థైస్ కనిపించే విధంగా ఈ డ్రెస్ లో కియరా అద్వానీ పోజులు ఇచ్చి రెచ్చగొట్టింది.