AP Politics: ఏపీలో అధికార పార్టీ వైఎస్ఆర్సిపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల లక్ష్యంగా బలమైన రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. అధికారంలోకి రావడానికి కావలసిన అన్ని అవకాశాలను సృష్టించుకుంటూ ప్రజాక్షేత్రంలోకి బలంగా వెళ్తున్నాయి. ఇక వచ్చే ఎన్నికలలో కాపులు ఏపీ రాజకీయాలలో కీలక భూమిక పోషించే అవకాశం ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఈ సారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంట ఈసారి మెజారిటీ కాపు సామాజిక వర్గం నిలబడటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వైసీపీలో కూడా కీలక పదవుల్లో కాపు నాయకులు ఉన్నారు.
వీరందరూ తమ సామాజిక వర్గం ఓటర్లను మొబలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని వీలైనంత తగ్గించాలని ట్రై చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని వైసీపీలోకి తీసుకురావాలని వ్యూహాత్మకంగా ఆలోచన చేస్తున్నారు. తుని రైలు దగ్ధం ఘటనలో కేసులు కొట్టేయడంతో ఇప్పుడు ముద్రగడకి లైన్ క్లియర్ అయ్యింది. దీంతో ఆయన తనయుడిని వైసీపీ తరపున ఎమ్మెల్యేగా బరిలో దించాలని అనుకుంటున్నారు. అలాగే చేస్తే కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ వైపు మళ్ళకుండా తమవెంట ఉంటుందని భావిస్తున్నారు.

ఇక టీడీపీ అయితే చాలా ధీమాగా ఉంది జనసేన పొత్తు ద్వారా కాపు ఓట్లు అన్ని కూడా మరల తమకి వస్తాయని భావిస్తున్నారు. అలాగే వంగవీటి రాదా ద్వారా కొంత ప్రభావం చూపించొచ్చు అనుకుంటున్నారు. మొత్తానికి కాపు ఓట్లతోనే వచ్చే ఎన్నికలలో వైసీపీ, టీడీపీ అధికారంలోకి రావాలని వ్యూహాలు వేస్తూ ఉండటం విశేషం.ఇక కాపు ఓటర్లు పవన్ కళ్యాణ్ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నా కూడా అధికార భాగస్వామ్యం కోరుకుంటున్నారు. అది జరిగితే టీడీపీ, జనసేన పొత్తుకి సమ్మతిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ వారిని ప్రభావితం చేయడంలో ఏ మేరకు సక్సెస్ అవుతారనేది చూడాలి.