Jyeshtha Pournami: ప్రతినెల మనకు ఒక పౌర్ణమి వస్తుంది. ఇలా ఏడాదిలో ప్రతి నెల పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే జేష్ఠ్య మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రత్యేకత ఉంది.జేష్ఠ్య పౌర్ణమిను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు.జూన్ 29వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3.06 గంటలకు పౌర్ణమి ప్రారంభమవుతుంది. జూన్ 30వ తేదీ మంగళవారం ఉదయం 5.26 గంటలకు ఈ ఘడియలు ముగుస్తాయి. ఈ పౌర్ణమి ఘడియలలో కొన్ని పనులు చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు. ఈరోజు నిర్వహించే స్నానాలు దానాలు సకల సంపదలకు కారణమవుతాయని పండితులు చెబుతున్నారు.
పౌర్ణమి ఘడియలలో తలంటు స్నానం చేసి విష్ణువు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. ఈ పూజ అనంతరం విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేయటం ఎంతో మంచిది. లక్ష్మీ స్వరూపమైన తులసి కోటకు పూజ చేసి తులసి కోట ముందు దీపం వెలిగించి ప్రదక్షణలు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం, కుటుంబంలో శాంతి శ్రేయస్సులు ఉంటాయి. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలి అనుకునే వారికి జేష్ఠ్య పౌర్ణమి ఎంతో శుభప్రదమైనదిగా భావిస్తారు. పితృ దోషాలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున పితృత తర్పణాలు చేయటం వల్ల దోషాలు తొలగిపోయి పితృదేవతల ఆశీర్వాదాలు పొందవచ్చు.

Jyeshtha Pournami: దానధర్మాలతో రెట్టింపు ఫలితాలు..
విష్ణు స్వరూపమైన రావి చెట్టుకు పూజలు నిర్వహించడం శుభప్రదం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపారాధన చేసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టడం వల్ల విష్ణుదేవుడు అనుగ్రహం మనపై ఉంటుంది. చంద్రోదయం తర్వాత పాలల్లోకి కొద్దిగా నీటిని కలిపి చంద్రుడికి ఆర్గ్యం ఇవ్వటం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజు ఈ విధమైనటువంటి పూజలు చేయటం ఎంతో మంచిది అయితే ఈ పౌర్ణమి రోజు జంతువులకు పచ్చి గడ్డిని ఆహారం అందించడం ఎంతో మంచిది అదే విధంగా బియ్యం, గోధుమలు, నువ్వులు, మట్టి కుండలు, వస్త్రాలు, అన్నదానం, పండ్లు ఇతరులకు దానం చేయటం వల్ల రెట్టింపు ఫలితాలు కలుగుతాయి.

