Latest News: డిజిటల్ ప్రపంచంలో ఆర్ధికంగా ప్రపంచ మార్కెట్ ని క్రిప్టో కరెన్సీ శాసిస్తున్న సంగతి తెలిసిందే. అసలు ఫిజికల్ రూపమే లేని ఈ క్రిప్టో కరెన్సీ పుట్టుక ఎప్పుడు జరిగింది అనేదానికి కచ్చితమైన వివరణ లేకపోయిన గత కొన్నేళ్ల నుంచి దీని విలువ పెరుగుతూ అంతర్జాతీయ మార్కెట్ లో అతి పెద్ద షేర్ మార్కెట్ గా కొనసాగుతుంది. చాలా దేశాలు ఈ క్రిప్టో కరెన్సీని అధికారికంగా గుర్తించి అందులో పెట్టుబడులు పెట్టడానికి ప్రజలకి వెసులుబాటు కల్పించాయి. దీంతో ప్రజలు కూడా విరివిగా ఆదాయం రెట్టింపు అవుతుందనే ఆశతో క్రిప్టో కరెన్సీ మీద పెట్టుబడులు కూడా పెట్టారు.
ఇక దీని మారక విలువ పెరుగుతూ ఉండటంతో పెట్టుబడులు పెట్టిన అందరూ కూడా సంతోషించారు. వారి ఆదాయం గణనీయంగా పెరిగిపోతూ ఉండటంతో మరింతగా క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ తో పాటు చాలా డిజిటల్ కాయిన్స్ మీద పెట్టుబడులని పెట్టారు. అయితే స్థిరత్వం లేకుండా, కచ్చితమైన ట్రాన్సపరెన్సీ లేకుండా నడుస్తున్న ఈ క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఏదో ఒక రోజు కూలిపోవడం గ్యారెంటీ అనే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ నేపధ్యంలో భారతీయులు క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు పెట్టకుండా అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అందులో సక్సెస్ అయ్యింది. ఇండియా నుంచి కేవలం మూడు శాతం మాత్రమే క్రిప్టో కరెన్సీలో మదుపర్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇక ఆర్బీఐ ఊహించిన విధంగా ఈ కరెన్సీ వేల్యూ క్రమంగా పతనం అవుతూ వస్తుంది.
క్రిప్టో కరెన్సీ లో బిట్ కాయిన్ విలువ గత ఏడాది గరిష్టంగా 69 వేల డాలర్లకి చేరుకుంది. దీంతో దానిపై పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికి కోట్ల రూపాయిలు లాభాలు వచ్చాయి. అయితే ఏడాది కాలంలోనే అనూహ్యంగా బిట్ కాయిన్ విలువ పతనం అవుతూ వచ్చింది. ప్రస్తుతం దాని విలువ మార్కెట్ లో 16500 డాలర్లకి పడిపోయింది. అంటే ఏడాదిలో 75 శాతంలో మార్కెట్ లో బిట్ కాయిన్ వేల్యూ క్షీణించింది. ఈ పతనంతో మదుపర్లలో కూడా టెన్షన్ మొదలైంది. దీంతో మరింత నష్టపోయే ప్రమాదం ఉందని భావిస్తూ తమ పెట్టుబడులు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ లో ఆర్బీఐ క్రిప్టో కరెన్సీని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ ఎందుకు వస్తుంది అనే విషయం ఇప్పుడు షేర్ మార్కెట్ పై పెట్టుబడులు పెట్టె మదుపర్లకి ప్రస్ఫుటంగా అర్ధమైంది.