Health Tips: ప్రస్తుతం వేసవికాలం వల్ల ఎండలు భగభగ మండిపోతున్నాయి. వేడి నుండి ఉపశమనం పొందటానికి ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరిచే ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే వేసవిలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గించటానికి శీతల పానీయాలు మాత్రమే కాకుండా కొన్ని ధాన్యాలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఈ ధాన్యాలను మనం ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలగటమే కాకుండా వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల నుండి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గించే ధాన్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
• రాగులు : రాగులలో ఎన్నో పోషక పదార్థాలు ఉన్నాయి. రాగులను పిండి చేసి మనం ఆహార పదార్థాలను తయారు చేసుకునే తినటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా వేసవికాలంలో రాగి సంగటి, రాగి జావా వంటివి ఆహారంగా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతని చల్లబరుస్తాయి. అంతే కాకుండా వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం ఆకలి కూడా వేయదు.
Health Tips:
• బార్లీ గింజలు : బార్లీ గింజలలో కూడా అనేక పోషక పదార్థాలు ఉంటాయి. వేసవికాలం శీతాకాలం అని తేడా లేకుండా ప్రతిరోజు బార్లీ గింజలతో తయారు చేసిన జావా తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల నుండి శరీరాన్ని కాపాడటంలో ఎంతో ఉపయోగపడతాయి.
• జొన్నలు : జొన్నలు ఎంతో బలవర్తకమైన ఆహారం. జొన్న పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అలాగే వేసవికాలంలో కూడా అధిక ఉష్ణోగ్రతల నుండి మన శరీరాన్ని కాపాడుతాయి.