Thu. Jul 10th, 2025

    Harishshankar: ‘షాక్’ సినిమాతో దర్శకుడిగా మారిన హరీష్ శంకర్ ఆ తర్వాత ‘మిరపకాయ్’ మూవీతో మాస్ మహారాజాకి భారీ కమర్షియల్ హిట్ ఇచ్చాడు. దీని తర్వాత టాలీవుడ్ లో హరీష్ శంకర్ బాగా పాపులర్ అయ్యాడు. ‘గబ్బర్ సింగ్’, ‘దువ్వాడ జగన్నాధం’, ‘గద్దలకొండ గణేశ్’.. లాంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్‌గా మారాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

    ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల కనిపించబోతుంది. అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉన్న కారణంగా కొన్ని నెలలు ఉస్తాద్ కి బ్రేక్ ఇచ్చారట. దాంతో ఈ గ్యాప్ లో హరీష్ మరో ప్రాజెక్ట్ ని టేకప్ చేశాడు. మరోసారి రవితేజతో సినిమా చేస్తున్నట్టుగా ఇటీవల కన్‌ఫర్మ్ చేశాడు. బాలీవుడ్ లో అజయ్ దేవగన్, ఇలియానా జంటగా నటించిన ‘రైడ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.

    harishshankar-They are the two heroines in my mind
    harishshankar-They are the two heroines in my mind

    Harishshankar: శృతి హాసన్ లేదా పూజా హెగ్డేలలో ఒకరు రవితేజ సరసన

    అయితే, ఈ సినిమా కోసం మేకర్స్ ఇద్దరు హీరోయిన్స్ ని అనుకుంటే వారు రవితేజ సరసన నటించడానికి నో చెప్పినట్టు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్నాయి. దాంతో స్వయంగా హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటివరకూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం అన్నాడు. మీనాక్షి చౌదరీ, ‘సలార్’ ఫేం త్రిప్తి లను అనుకున్న మాట అబద్దం అన్నారు.

    ఈ సినిమా కాస్టింగ్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిందని, శృతి హాసన్ లేదా పూజా హెగ్డేలలో ఒకరు రవితేజ సరసన నటించబోతున్నారని వారిలో ఎవరు ఫైనల్ అవుతారో త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్టుగా హరీష్ శంకర్ వెల్లడించారు. ఆయన ఈ విధంగా క్లారిటీ ఇచ్చాక ఇంకో కామెంట్ వినిపిస్తోంది. హరీష్ పూజా హెగ్డేని వదిలేలా లేడని. అవును గతంలో కూడా ఇదే టాక్ వినిపించింది. ఏదేమైనా రవితేజ సినిమాలో హీరోయిన్ గురించి ఓ క్లారిటీ అయితే వచ్చేసింది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.