Health Tips: ఉదయం నిద్ర లేవగానే చాలామంది బ్రష్ చేయనిదే ఏ పని కూడా చేయరు. ముందు బ్రష్ చేసిన తర్వాత నీటిని తాగడం కొందరికి అలవాటుగా ఉంటే మరికొందరు కాఫీ తాగడం అలవాటు చేసుకుంటూ ఉంటారు. అయితే చాలామంది పాచి నోటితోనే కాఫీలు టీలు కూడా తాగేస్తూ ఉంటారు. ఇలా బ్రష్ చేయకుండా ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది కాదని చాలామంది భావిస్తారు కానీ ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాక్ అవుతారు.
ఉదయం నిద్ర లేవగానే పాచి మొహంతోనే నీటిని తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలామంది నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటివారు ఉదయం నిద్ర లేవగానే నీటిని తాగటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అనంతరం బ్రష్ చేయడం మంచిది. ఇక ఉదయమే లేచిన వెంటనే నీళ్లు తాగటం వల్ల మన శరీరంలో జరిగే మెటబాలిజం రేటు పెరుగుతుంది. జీర్ణ క్రియ చాలా సులువుగా మారడమే కాకుండా మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు మొత్తం బయటకు తొలగిపోతాయి.
ఉదయం పళ్లు తోముకునే ముందు నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో సీజనల్ ఇన్ఫెక్షన్ల కారణంగా జలుబు, దగ్గుతో బాధపడేవారు తప్పనిసరిగా ఉదయం పూట పాచి నోటితో నీటిని తీసుకోవాలి. ఉదయాన్నే పాచి నోటితో నీరు తాగడం ద్వారా హై బీపీ, బ్లడ్ షుగర్ అదుపులో ఉంచుకోవచ్చు. దీని కోసం ఉదయం నిద్రలేచిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగటం ఎంతో మంచిది. ఇలా ఉదయమే బ్రష్ చేయకుండా నీటిని తాగటం వల్ల ఈ ప్రయోజనాలన్నింటినీ మనం సొంతం చేసుకోవచ్చు.