Devotional Facts: సాధారణంగా ఇంట్లో గడప మీద కాలు పెట్టడం మంచిది కాదని మన పెద్దలు చెబుతుంటారు. అంతే కాకుండా మహిళలు పొరపాటున కూడా గడప మీద కాలు పెట్టడం,లేదా గడప మీద కూర్చోకూడదు అని చెబుతుంటారు.అలా గడప మీద కాలు వేసి తొక్కితే మహా పాపమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే నిజంగా గడప మీద కాలు వేయడం తప్పా? దీని వలన మనకు ఏమైనా సమస్యలు వస్తాయా? అనే విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో ఇంటిని నిర్మించుకునే సమయంలో ప్రధాన ద్వారం వద్ద తప్ప మిగిలిన ఏ గదులకు గడపలు ఉండవు. కానీ పూర్వం మాత్రం ప్రతి గదికి తప్పనిసరిగా గడప ఉండేది. అదికూడా చెక్కతో చేసిన గడప మాత్రమే ఉండేది. అయితే చాలామంది ఆ గడపకి బొట్లు పెట్టి, పసుపు రాసి ఎంతో అందంగా అలంకరిస్తారు. ఇక శుక్రవారం నాడు లేదా ముఖ్యమైన పర్వదినాల్లో కానీ గడపలకి పూజ చేస్తూ ఉంటారు. పసుపురాసి, బొట్టు పెట్టి, పూజలు చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో ముఖద్వారం వద్ద ఉన్న గడపకి పూజలు చేయడం కూడా కొంతమంది బరువుగా భావిస్తున్నారు.
మన పురాణాల ప్రకారం ముఖద్వారం వద్ద ఉన్న గడప లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ప్రతిరోజు ఉదయం ఇంటికి శుభ్రం చేయటంతో పాటు గడపని గంగాజలంతో శుభ్రం చేసి పసపు , కుంకుమ రాసి అందంగా అలంకరిస్తారు. ఇలా గడపని ప్రతిరోజు అందంగా అలంకరించటం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలై మన ఇంట్లో అడుగుపెడుతుందని పెద్దల. అందుకే లక్ష్మీదేవి స్వరూపమైన గడపని తొక్క కూడదని మన పెద్దలు చెబుతుంటారు. అలాగే నరదిష్టి తగలకుండా ఉండాలంటే కూడా శుక్రవారం నాడు గడపకి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, నల్లటి పటిక కడితే నరదిష్టి కూడా పోతుంది.