Thu. Jul 2nd, 2026

    Cinema News: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం యూరప్‌ పర్యటనలో ఉన్న ఆయనకు ఫ్రాన్స్‌ వేదికగా మునుపెన్నడూ లేని విధంగా ఒక విలక్షణమైన గౌరవం దక్కింది. అక్కడి ప్రతిష్టాత్మక ఆర్ట్స్ సెంటర్ ‘సినిమాటిక్ ఫ్రాంచైజ్’ జక్కన్న సృజనాత్మకతకు దాసోహమంటూ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.

    ఈ ఆర్ట్స్ సెంటర్‌లోని అత్యంత విలాసవంతమైన, చారిత్రాత్మకమైన ‘హెన్రీ లాంగ్లోయిస్ హాల్’ లో రాజమౌళి పేరుతో ఒక పర్మనెంట్ సీటును కేటాయించారు. ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగానికి విశేష సేవలందించిన దిగ్గజాలకు మాత్రమే దక్కే ఈ అరుదైన గుర్తింపు, ఇప్పుడు ఒక భారతీయ దర్శకుడికి లభించడం గమనార్హం. కేవలం ఈ సీటును కేటాయించడమే కాకుండా, ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ కోస్టా గావ్రాస్ స్వయంగా రాజమౌళిని సత్కరించి ఈ గౌరవాన్ని అందజేయడం విశేషం.

    cinema-news-rajamouli-makes-history-in-france-gets-a-permanent-seat-there
    cinema-news-rajamouli-makes-history-in-france-gets-a-permanent-seat-there

    Cinema News: ఊహించని సర్ ప్రైజ్‌కు రాజమౌళి సైతం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 

    ఈ ఊహించని సర్ ప్రైజ్‌కు రాజమౌళి సైతం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఫ్రాన్స్ పర్యటనలో తనకు ఇలాంటి అద్భుతమైన సత్కారం లభిస్తుందని కలలో కూడా అనుకోలేదంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా సర్టిఫికేట్ ఫోటోలను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ సినిమా `వార‌ణాసి`కి సంబంధించిన ప్రమోషన్స్, గ్రౌండ్ వర్క్‌లో భాగంగానే జక్కన్న ఈ టూర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి అంతర్జాతీయ వేదికలపై రాజమౌళికి లభిస్తున్న ఈ బ్రాండ్ ఇమేజ్, రాబోయే ఆయ‌న భారీ ప్రాజెక్టుకు విదేశీ మార్కెట్‌లో ఒక సాలిడ్ పునాదిని క్రియేట్ చేస్తోందని చెప్పొచ్చు.

    cinema-news-rajamouli-makes-history-in-france-gets-a-permanent-seat-there
    cinema-news-rajamouli-makes-history-in-france-gets-a-permanent-seat-there

    cinema-news-rajamouli-makes-history-in-france-gets-a-permanent-seat-there
    cinema-news-rajamouli-makes-history-in-france-gets-a-permanent-seat-there

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.