Chat GPT: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న సరికొత్త టెక్నాలజీ. ఇప్పటికే ఆన్లైన్ ప్రపంచంలో మెజారిటీ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారానే తమ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని విభాగాలకు సంబంధించిన మానవ వనరులను కూడా ఆయా కంపెనీలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ కారణంగా ఇప్పటికే చాలామంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీలో వినియోగదారులకు కావాల్సిన సమస్త సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆయా కంపెనీలు తెలుసుకుని వారికి అందించే ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీలో సరికొత్తగా ఆవిష్కరించబడిన ఏఐ పవర్ చాట్ జీపీటీ ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త ఆవిష్కరణగా కొనియాడబడుతుంది. ఈ చాట్ జీపీటీ బోట్ లో ఎలాంటి సమాచారం కావాలనుకున్న దాన్ని టైప్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమస్త సమాచారం మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. టెక్స్ట్ రూపంలో ఇప్పటికి ఈ చాట్ జీపీటీ సేవలు అందిస్తుంది. మానవ మేధస్సుని సవాలు చేస్తూ కావలసిన సమాచారాన్ని క్షణాల్లో అందిస్తున్న ఈ వెబ్ బోట్ ఇప్పుడు ఒక సెన్సేషనల్ గా మారింది. చాలామంది దీనిని వినియోగిస్తున్నారు. చాలా తక్కువ సమయంలో ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. ఇందులో లవ్ లెటర్ అని టైప్ చేస్తే దానికి సంబంధించిన ఫార్మాట్ క్షణాల్లో వచ్చేస్తుంది. అలాగే స్టొరీ ఐడియాని టైప్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక కథను తయారుచేసి అందిస్తుంది.
అలాగే టెక్స్ట్ కరెక్షన్స్ కూడా చేస్తుంది. గూగుల్లో శోధించటానికి సమయం పట్టి సమాచారాన్ని కూడా ఒక ప్రశ్నతో టెక్స్ట్ రూపంలో అందిస్తుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాచారాన్ని, శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్ చాట్ జీపీటీ ఏఐ బోట్ అందిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు దీనిలో పైలెట్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ని సరి కొత్తగా తీసుకొచ్చారు. ఈ విషయాన్ని అధికారులుగా ప్రకటించారు. కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రకారం నెలకు 20 డాలర్లతో చాట్ జీపీటీ ప్లస్ అందుబాటులో ఉంటుంది. కన్జర్వేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగదారులతో చాట్ చేస్తుందని, ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదని, తప్పుడు వ్యాఖ్యలను కూడా చాలా చేస్తుందని కూడా పేర్కొన్నారు. అయితే ఈ కొత్త వెర్షన్ యూఎస్ లోని కస్టమర్లకు ప్రస్తుతం అందుబాటులో ఉందని, రాబోయే వారంలో మిగిలిన దేశాలలో కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.