Hot Water: చల్ల నీటితో పోలిస్తే వేడి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చాలామంది కాస్త గోరువెచ్చని నీటిని తాగుతూ ఉంటారు ముఖ్యంగా చలికాలంలో గోరువెచ్చని నీరు తాగటం వల్ల ఏ విధమైనటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి ముఖ్యంగా డయేరియా ఇన్ఫెక్షన్ కి గురి కాకుండా ఉంటుంది. అలాగే దగ్గు జలుబు వంటి సమస్యలతో బాధపడే వారికి కూడా వేడి నీళ్ళు చాలా ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని చలికాలంలో మాత్రమే కాకుండా వేసవికాలంలోనూ వేడి నీళ్లను అధికంగా తాగుతున్నారు అంటే మీరు ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు.
చాలామంది ఉదయం లేవగానే పరగడుపున గోరువెచ్చని నీటిని తాగుతూ ఉంటారు. ఇలా తాగటం వల్ల పేగులన్నీ శుభ్రం అవుతాయని అలాగే బరువు తగ్గడానికి కూడా ఎంతో దోహదం చేస్తుందని భావిస్తూ ఉంటారు. ఇలా చలికాలంలో ఉదయమే పరగడుపున గోరువెచ్చని నీటిని తాగడం మంచిదే కానీ వేసవికాలంలో బోరువెచ్చని నీటిని పరగడుపున తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగడం వల్ల మీ శరీరం pH పాడుచేయవచ్చు. శరీరం ఆమ్ల, ప్రాథమిక స్వభావం మధ్య సమతుల్యత చెదిరిపోయినప్పుడు శరీరం pH క్షీణిస్తుంది. దీంతో ఎసిడిటీ సమస్య అజీర్తి వంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి వేడి నీటిని తాగటం మంచిదే కానీ తరచు తాగటం వల్ల పాయువు, చిన్న పేగు, పెద్ద ప్రేగు కణజాలాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగడం మానేయాలి. ఇలాగే తాగుతూ ఉంటే క్రమక్రమంగా అది మలబద్ధకానికి ఫైల్స్ రావడానికి కూడా కారణం అవుతుంది. అలాగే మన శరీరం నీటి శాతాన్ని కోల్పోవడానికి కూడా కారణం అవుతుంది. అందుకే వేసవికాలంలో వీలైనంతవరకు గోరువెచ్చని నీటిని అవాయిడ్ చేయడమే మంచిది.