Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఆయన హీరోగా నటించిన పుష్ప 2 ఈ నెల 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 4న ఏపీ, తెలంగాణాలో బెనిఫిట్ షోలను నిర్వహించారు. ఈ బెనిఫిట్ షోలను చూసేందుకు అల్లు అర్జున్ అభిమానులు, సినీ ప్రేమికులు ఊహించని విధంగా థియేటర్స్ కి వచ్చారు.
అయితే, పెద్ద హీరో సినిమా అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే చూడాలని ఎంతోమంది ఉర్రూతలూగుతుంటారు. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అభిమానుల కోలాహలం అంతా ఇంతా కాదు. ఎప్పటిలాగే పుష్ప 2 చూసేందుకు సంధ్య థియేటర్స్ కి ఫ్యాన్స్ వచ్చారు. అదే బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ సహా మిగతా నటీనటులు ప్రముఖులు వస్తున్నారని తెలియడంతో అందరూ ఒక్కసారిగా తోసుకున్నారు.
Breaking News: చంచల్ గూడా జైలుకి అల్లు అర్జున్..!
ఈ తోపులాటలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్దారు. ఇది తెలుసుకున్న అల్లు అర్జున్ మృతి చెందినవారికి 25 లక్షల నష్టపరిహారం కూడా చెల్లించారు. అయినా మృతికి కారణం అల్లు అర్జున్ అని ఈరోజు(డిసెంబర్ 13) హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి వైధ్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
వాదనలు విన్న న్యాయమూర్తి అల్లు అర్జున్ కి 14 రోజుల పాటు రిమాండ్ విధించగా చంచల్ గూడా జైలుకి తరలించారు. మరి ఎంతకాలం అల్లు అర్జున్ జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందో అని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా, అరెస్ట్ చేసినప్పటి నుంచి అల్లు అర్జున్ తో తండ్రి అల్లు అరవింద్, సోదరులు అల్లు బాబి, అల్లు శిరీష్ ఉన్నారు.