EyeLashes: ఒక మనిషి శరీరంలో ప్రతి ఒక్క భాగం కూడా ఎంతో కీలకమైనదని చెప్పాలి. ముఖ్యంగా మన అందాన్ని రెట్టింపు చేయడంలో కళ్ళు కనురెప్పలు కనుబొమ్మలు కీలకపాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇలా ఈ కనురెప్పలు అందంగా ఉంటేనే మనం కూడా అందంగా కనిపిస్తూ ఉంటాము ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ కనురెప్పలు అందుబాటులోకి వచ్చాయి. మన కళ్ళ అందాన్ని రెట్టింపు చేయడానికి ఈ కనురెప్పలు ఎంతగానో దోహదం చేస్తూ ఉంటాయి అయితే చాలామందిలో తరచు కనురెప్పలు రాలిపోతూ ఉంటాయి.
ఈ విధంగా మనలో కనురెప్పలు తరచూ రాలిపోతున్నాయి అంటే మనం ఈ సమస్యతో బాధపడుతున్నామని అర్థం. మరి కనురెప్పలు రాలిపోవడం ఏ సమస్యకు సంకేతం అనే విషయానికి వస్తే.. కనురెప్పలు ఎక్కువగా రాలిపోవడానికి ప్రధాన కారణం థైరాయిడ్ హార్మోన్ లోపమని చెప్పాలి. ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్ లోపించే ఉంటుందో అప్పుడు కనురెప్పలు తరచూ రాలిపోతూ ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్ లోపం వలన శరీరంలో ప్రోటీన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.
హైపోథైరాయిడిజం కారణంగా వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. కాబట్టి కనురెప్పలు కూడా రాలిపోతూ ఉంటాయి. మయస్తీనియా గ్రావిస్ అనే వ్యాధి కూడా కనురెప్పలు రాలిపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో, కండరాలలో బలహీనత కలగడం వలన ఈ వ్యాధి వస్తుంది. దీంతో కండరాలు సరిగా పనిచేయకపోవడం, కనురెప్పలు రాలడం లాంటి ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. ఇలా పలు అనారోగ్య సమస్యల కారణంగా మన కనురెప్పలు తరచూ రాలిపోతూ ఉంటాయి ఇలా కనురెప్పలు రాలిపోతూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఎంతో మంచిది.