Fri. Nov 14th, 2025

    Animal Review: రష్మిక మందన్న ఖాతాలో మళ్ళీ ఫ్లాప్..’యానిమల్’ దెబ్బ గట్టిగా పడినట్టే..! అంటూ తాజాగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఈ వారం భారీ అంచనాల మధ్య వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యానిమల్’. ఈ సినిమాను బాలీవుడ్ లో తెరకెక్కించి మిగతా సౌత్ భాషలలోనూ రిలీజ్ చేశారు. హైదరాబాద్ లో భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిపారు.

    ఈ ఈవెంట్ కి రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడు, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరో వచ్చి సినిమాపై తెగ హైప్ క్రియేట్ చేశారు. ట్రైలర్ తో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇచ్చిన హైప్ ఒకెత్తైతే రాజమౌళి, మహేశ్ ఇచ్చిన బూస్టింగ్ ఇంకో ఎత్తు. దాంతో ‘యానిమల్’ సినిమాపై మరీ ఎక్కువగా అంచనాలు క్రియెట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న లైఫ్ టర్న్ అవుతుందనీ నమ్మకాలు పెట్టుకుంది.

    animal-review- Rashmika Mandanna's account flopped again.. 'Animal' was hit hard..!
    animal-review- Rashmika Mandanna’s account flopped again.. ‘Animal’ was hit hard..!

    Animal Review: నెగిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. 

    జనాలు కూడా ‘యానిమల్’ సినిమాతో రష్మిక మందన్న బాలీవుడ్ లో బలంగా నిలబడుతుందని చర్చించుకున్నారు. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. తాజాగా బాక్సాఫీస్ వద్ద రిలీజై ‘యానిమల్’ నెగిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. రన్ టైం గురించి పట్టించుకోకండి అన్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపై కామెంట్స్ కురుస్తున్నాయి. సినిమా ఇలా ఉంటుందనే ముందుగా సందీప్ ప్రేక్షకులను ప్రిపేర్ చేశారా..అని మాట్లాడుతున్నారు.

    మిగతా వారికంటే ఎక్కువగా నమ్మకాలు పెట్టుకున్న రష్మిక మందన్నకి ‘యానిమల్’ మూవీ గట్టిగానే నెత్తిమీద మొట్టిందని ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. ‘పుష్ప’ తర్వాత మళ్ళీ రష్మిక ఖాతాలో సక్సెస్ చేరింది లేదు. ఈ మూవీపై పెట్టుకున్న నమ్మకాలు తారుమారయ్యాయి. ‘యానిమల్’ కూడా రష్మిక ఖాతాలో ఫ్లాప్ మూవీగా చేరిందంటున్నారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.