Sun. Jul 13th, 2025

    Animal Review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యానిమల్’ సినిమాను మహేశ్ బాబు అందుకే రిజెక్ట్ చేశాడా..? ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అంటూ ఇప్పుడు ఓ న్యూస్ ట్రెండ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. ఈ సినిమాకి డివైడ్ టాక్ రావడంపై మహేశ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారట.

    సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రన్‌బీర్ కపూర్ హీరోగా నటించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతర ముఖ్య భూమికల్లో కనిపించారు. టీజర్, ట్రైలర్ ‘యానిమల్’ సినిమాపై గట్టిగానే అంచనాలు పెంచాయి. వాటికి వచ్చిన రెస్పాన్స్ చూసి మహేశ్ బాబు సాలీడ్ యాక్షన్ మూవీని మిస్ చేసుకున్నాడని టాలీవుడ్ లో చెప్పుకున్నారు.

     

    animal-review- Is that why Mahesh Babu rejected? Fans are full of happiness
    animal-review- Is that why Mahesh Babu rejected? Fans are full of happiness

    Animal Review: మహేశ్ ‘యానిమల్’ రిజెక్ట్ చేసి ఫ్లాప్ నుంచి తప్పించుకున్నారు.

    కానీ, ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ చూసి హమ్మయ్య మా మహేశ్ ‘యానిమల్’ రిజెక్ట్ చేసి ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడని అంటున్నారు. అర్జున్ రెడ్డి సక్సెస్ తర్వాత ‘యానిమల్’ కథను సందీప్ రెడ్డి వంగ మహేశ్ బాబుతో పాటు మిగతా స్టార్ హీరోలకి చెప్పాడట. వారందరూ ఇంత వాయిలెన్స్ ఉన్న కథ మాకొద్దు అని సందీప్ రెడ్డి వంగ మార్క్ రొమాన్స్ మూవీలో మేము చేయలేమని రిజెక్ట్ చేశారు.

    దాంతో ‘యానిమల్’ కథను హిందీలో స్టార్ హీరో రన్‌బీర్ కి చెప్పి ఒప్పించాడు. ఒకవేళ ఈరోజు టాక్ పాజిటివ్ గా వస్తే సినారియో అంతా ఇంకోలా ఉండేది. కానీ, ఊహించినదానికంటే పూర్తి భిన్నంగా రావడంతో సందీప్ రెడ్డి వంగ మీద కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా మహేశ్ బాబు ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా ఫీలవుతున్నారట యానిమల్ కథ రిజెక్ట్ చేసినందుకు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.