పర్యాటకులను విపరీతంగా ఆకర్షించే బాపట్ల జిల్లాలోని ప్రసిద్ధ సూర్యలంక బీచ్, అలాగే పర్యాటక రాజధాని విశాఖపట్నం తీరాలను ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం ఎంచుకుంది. ప్రాథమికంగా ఈ రెండు ప్రాంతాలలో రెండేసి చొప్పున, మొత్తం నాలుగు బీచ్ షాక్స్ (తాత్కాలిక బార్లు) ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది. ఇవి సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మరిన్ని బీచ్‌లకు ఈ పాలసీని విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనివల్ల స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Andhra Pradesh: బీచ్‌ల్లో ఎంజాయ్‌మెంట్‌తో పాటు శాంతిభద్రతలకు భంగం కలగకుండా
బీచ్‌ల్లో ఎంజాయ్‌మెంట్‌తో పాటు శాంతిభద్రతలకు భంగం కలగకుండా ప్రభుత్వం కొన్ని కఠినమైన రూల్స్ పెట్టింది. ఇక్కడ సాధారణ ఐఎమ్ఎఫ్ఎల్ బ్రాండ్లు, విదేశీ మద్యం విక్రయించడానికి వీల్లేదు. కేవలం తక్కువ ఆల్కహాల్ శాతం ఉండే బీర్, వైన్, రెడీ-టు-డ్రింక్ పానీయాలను మాత్రమే అనుమతిస్తారు. సమయం విషయంలోనూ కండిషన్స్ పెట్టారు. ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు మాత్రమే ఈ షాక్స్‌లో లిక్కర్ సరఫరా చేయాలి. భద్రతా కారణాల దృష్ట్యా రాత్రి ఎనిమిది గంటలకే విక్రయాలు నిలిపివేయాల్సి ఉంటుంది.
ఇక ఈ ప్రతిష్టాత్మక బీచ్ షాక్ బార్ లైసెన్స్‌ల కాలపరిమితిని మూడేళ్లుగా నిర్ణయించారు. వీటికి వార్షిక లైసెన్స్ ఫీజుగా ఏకంగా రూ. 75 లక్షలు ఖరారు చేశారు. ఈ ఫీజుపై ప్రతి ఏటా 10 శాతం చొప్పున పెంపు ఉంటుంది. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకుంటూనే, ఏపీ తీరాన్ని గ్లోబల్ టూరిజం హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో తీసుకున్న ఈ బ్లూ ఎకానమీ నిర్ణయంపై టూరిజం నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, వీకెండ్స్ వస్తే చాలు ఎక్కడికో వెళ్లాలనుకునే టూరిస్టులకు ఇకపై ఏపీ తీరంలోనే అసలైన పండగ షురూ కానుంది.

