Tue. Aug 18th, 2026

    Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ తాగిన తర్వాత వారి రోజువారి పనులు మొదలు పెడుతూ ఉంటారు అయితే ఇలా ఉదయాన్నే చాలామంది కాఫీ టీ తాగుతూ ఉంటారు. మరికొందరికి అల్లం టీ తాగే అలవాటు ఉంటుంది. మరి ఉదయాన్నే పరగడుపున అల్లం టీ తాగటం ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏం సూచిస్తున్నారు అనే విషయానికి వస్తే.. నిపుణుల అభిప్రాయం ప్రకారంఉదయాన్నే పరగడుపున ఒక కప్పు అల్లం టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

    అల్లంలో “జింజెరోల్” అనే యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణం ఉంటుంది. ఉదయాన్నే అల్లం టీ తాగితే జీర్ణక్రియ వేగంగా మొదలవుతుంది, గ్యాస్, అజీర్తి సమస్యలు తగ్గుతాయి. చలికాలంలో రోగనిరోధక శక్తి పెంచి జలుబు, దగ్గు వంటి రోగాలను దూరంగా ఉంచుతుంది. అలాగే మెటబాలిజం పెరిగి బరువు తగ్గడానికి కూడా అల్లం టి ఎంతగానో సహాయపడుతుంది.

    అల్లం టీ ఉదయమే తాగటం వల్ల జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండ కడుపులోని ఎంజైమ్‌లను ఉత్తేజపరిచి ఆహారం త్వరగా అరుగుదలకు సహాయపడుతుంది. ప్రయాణాల్లో వాంతి వచ్చే వారికి, గర్భిణీలకు ఉదయాన్నే అల్లం టీ ఉపశమనం ఇస్తుంది. ఇక కీళ్ల నొప్పులు, తలనొప్పి ఉన్నవారికి అల్లం సహజమైన పెయిన్ కిల్లర్ గా పనిచేస్తూ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మధుమేహంతో బాధపడేవారు అలాంటి తాగడం వల్ల బ్లడ్ షుగర్, చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

    Ginger tea health benefits know more details
    Ginger tea health benefits know more details

    Ginger Tea: ఉదయం పరగడుపున అల్లం టీ తాగడం..

    ఇన్ని ప్రయోజనాలు కలిగిన అల్లం టి ప్రతిరోజు ఉదయం బ్రష్ చేస్తున్న వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగిన ఒక 15 నిమిషాల తర్వాత అల్లం టీ తాగటం ఎంతో మంచిది. అయితే అల్లం టీ ఆరోగ్యానికి మంచిది కదా అని అందరూ తాగకూడదు ఎవరైతే అల్సర్, గ్యాస్ట్రిక్, రక్తం పలుచబడే మందులు వాడుతూ ఉంటారో అలాంటివారు తాగకపోవడమే మంచిది. ఇక గర్భిణీ స్త్రీలు కూడా రోజుకు ఒక గ్రాము కంటే ఎక్కువ అల్లం తీసుకోకూడదు. అలాంటి ఆరోగ్యానికి మంచిదని అతిగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట డయేరియా వంటిది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక పరిమితంగా తీసుకోవడం మంచిది.