Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కాఫీ టీ బదులుగా నిమ్మరసం తాగుతున్న సంగతి తెలిసిందే గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం తేనె కలుపుకొని తాగటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని భావిస్తూ ఉంటారు.అయితే ఇది ప్రతి ఒక్కరికీ సరిపోదు. ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండేవారు ప్రతిరోజు ఉదయం ఇలా నిమ్మరసంతో కలిపిన నీటిని తాగటం ఆరోగ్యానికి మంచిదే కానీ కొంతమంది ఈ నీటిని తాగటం వల్ల సమస్యలు మారింత పెరిగే అవకాశం ఉంటాయి. మరి నిమ్మరసం కలిపిన నీటిని ఉదయాన్నే ఎవరు తాగకూడదు ఏంటి అనే విషయానికి వస్తే..
ఎవరికైతే గ్యాస్ట్రిక్ సమస్య, యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంట తరచుగా వచ్చే వారు ఖాళీ కడుపుతో నిమ్మరసం కలిపిన నీటిని తాగితే గ్యాస్ట్రిక్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. నిమ్మలో ఉండే ఆమ్లత్వం కొందరిలో కడుపు మంట, పుల్లని తేన్పులు వంటి సమస్యలను ప్రేరేపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అలాగే దంతాల ఎనామెల్ సున్నితంగా ఉన్నవారు తరచుగా ఎక్కువగా పుల్లని పానీయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. అల్సర్ వంటి కడుపు సమస్యలు ఉన్నవారు కూడా తమకు సరిపోతుందో లేదో తెలుసుకోకుండా రోజూ ఖాళీ కడుపుతో లెమన్ వాటర్ తీసుకోవడం మంచిది కాదు.

Lemon Water: జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు..
నిమ్మరసం తాగిన తర్వాత నోటిని సాధారణ నీటితో పుక్కిలించడం మంచిది. ఇలా చేయడం వల్ల దంతాలపై ఆమ్ల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక దీర్ఘ కాలిక మందులు వాడే వారు కూడా డాక్టర్ సలహా మేరకు నిమ్మరసం తాగడం మంచిది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే పరిమితంగా తీసుకోవచ్చు. కానీ తాగిన తర్వాత గుండెల్లో మంట, కడుపు నొప్పి లేదా అసౌకర్యం కనిపిస్తే ఆపేయడం మంచిది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ లేదా ఇతర జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకుని తీసుకోవడం ఉత్తమం.

