TTD VIP Break: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్నటువంటి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూస్తూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. అయితే ఇదే అదునుగా భావించి కొంతమంది తిరుమలలో పెద్ద ఎత్తున మోసాలకు కూడా పాల్పడుతున్న సంగతి తెలిసిందే. త్వరగా దర్శన సౌకర్యాన్ని కల్పిస్తామంటూ ఇప్పటికే ఎంతోమంది తప్పుడు వెబ్సైట్ ద్వారా పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలపై తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఎప్పటికప్పుడు భక్తులను అలర్ట్ చేస్తున్నారు.
తాజాగా స్వామి వారి దర్శన విషయంలో జరుగుతున్న మోసాల పట్ల టిటిడి అధికారులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో “SCP Developers” పేరుతో కొంతమంది వ్యక్తులు తిరుపతి హైవే లో ప్లాట్లు కొనుగోలు చేస్తే “జీవితాంతం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తాం” అంటూ రీల్స్ వైరల్ అవుతున్నాయి. ఇది కాస్త టీటీడీ అధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే చర్యలు చేపట్టారు. ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రీల్ వీడియో పూర్తిగా అవాస్తవమని తెలిపారు.

TTD VIP Break: ఫ్లాట్ కొంటె దర్శనం ఫ్రీ..
తిరుపతి హైవే లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఎలాంటి విఐపి బ్రేక్ దర్శనాలను కల్పించడం లేదని ఇది పూర్తిగా అవాస్తవమని తెలియజేశారు. అదేవిధంగాఈ ప్రచారానికి టీటీడీతో ఎలాంటి సంబంధం లేదు. ఇటువంటి హామీలు ఇచ్చే అధికారం ఏ ప్రైవేటు సంస్థకు, వ్యక్తికి లేదని టీటీడీ స్పష్టం చేశారు. స్వామి వారి దర్శనానికి సంబంధించిన టికెట్లు ఇతరత అంశాలు అన్నీ కూడా అధికార వెబ్సైట్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయని ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నటువంటి ఇలాంటి ప్రచారాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇక ఈ విషయంపై టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోషల్ మీడియా నుంచి సదురు వీడియోని తొలగించారు అయినప్పటికీ పోలీసులు సదరుసంస్థ పై చట్టపరమైనటువంటి చర్యలను తీసుకున్నారు.

