Liver Health: మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అనే విషయాలను మన శరీర లక్షణాలను బట్టి అంచనా వేయవచ్చు. మన శరీరంపై కొన్ని లక్షణాలను కనుక వెంటనే గమనిస్తే పెద్దపెద్ద ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. ఇక మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం కూడా ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. మన శరీరంలో ఉండే అవయవాలలో లివర్ ప్రాధాన్యత కూడా చాలా ఉందనే చెప్పాలి. అందుకే లివర్ ఆరోగ్యం కూడా ఎంతో అవసరం. ఇటీవల కాలంలో మన జీవన విధానంలో పూర్తిగా మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలోనే లివర్ ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
ఇలా మన లివర్ ప్రమాదంలో ఉన్న విషయాన్ని మనం ప్రారంభ దశలో గుర్తించకపోయిన మన లివర్ ఆరోగ్యాన్ని మన శరీరం తెలియజేస్తుంది. ఎప్పుడైతే లివర్ అనారోగ్యానికి గురి అవుతుందో చర్మంపై ఈ లక్షణాలు కచ్చితంగా కనబడుతూ ఉంటాయి. మరి శరీరంపై కనిపించే లక్షణాలు ఏంటి అనే విషయానికి వస్తే… మన శరీరంలో లివర్ అనారోగ్యానికి గురి అయినప్పుడు బిలిరుబిన్ అనే పదార్థం పరిమితికి మించి పెరుగుతుంది ఎప్పుడైతే రక్తంలో బిలిరుబిన్ స్థాయిలు పెరుగుతాయో మన కళ్ళు శరీరం మొత్తం పసుపు రంగులోకి మారుతుంది దీనినే మనం కామెర్లు అని కూడా పిలుస్తాము. ఇలా మన కళ్ళు చేతి గోర్లు చర్మం పసుపు రంగులోకి మారుతుందో వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

Liver Health: ఈస్ట్రోజన్ హార్మోన్ నియంత్రణలో ఉండదు..
ఇక శరీరంపై దద్దుర్లు లేకపోయినా అలర్జీ లేకపోయినా చర్మం మొత్తం దురదగా ఉంటుంది. ఇలా చర్మం దురదగా ఉంటే అది లివర్ అనారోగ్యానికి సంకేతం అని చెప్పాలి.కాలేయం దెబ్బతిన్నప్పుడు శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు సరిగ్గా నియంత్రణలో ఉండవు తద్వారా చర్మానికి దగ్గరగా ఉండే సూక్ష్మ రక్తనాళాలు వ్యాకోచించి సాలీడు కాలు ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి. ఇలాంటి మచ్చలు కనుక మన చర్మంపై ఉన్నప్పుడు డాక్టర్లను సంప్రదించి తగు పరీక్షలు చేయించుకోవాలి. కాలేయం పనితీరు మందగించినప్పుడు అరచేతి బొటనవేలు కింది భాగం ఎరుపు రంగులోకి మారుతుంది. ఇది కూడా లివర్ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఈ లక్షణాలు ఉంటే మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్లేనని వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది.

