Thu. Jul 9th, 2026

    AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వానికి ఆకర్షితులై వివిధ రంగాల ప్రముఖులు జనసేన వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, క్రీడాకారుడు గుడిపాటి సీతారామ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతంతో ముందుకెళ్తున్న పవన్ నాయకత్వంలో పనిచేయడానికే తాను పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

    అయితే ఈ చేరిక వెనుక ఒక ఆసక్తికరమైన కనెక్షన్ ఉంది. గుడిపాటి సీతారామ్ భార్య మరెవరో కాదు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ గాయని శ్రీలలిత. విజయవాడ కనకదుర్గమ్మపై ఆమె పాడిన ‘కనకదుర్గా మహా ప్రభావం’ అనే భక్తి గీతాన్ని ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపించిన సంగ‌తి తెలిసిందే. ప్రధాని మెచ్చిన ఈ సింగర్ ఫ్యామిలీ ఇప్పుడు జనసేనలో చేరడంతో ఏపీ రాజకీయ, సామాజిక వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.

    ap-news-the-family-praised-by-modi-now-joins-janasena
    ap-news-the-family-praised-by-modi-now-joins-janasena

    AP NEWS: ఎం.ఎం. కీరవాణి టీమ్‌లో పనిచేస్తున్న శ్రీలలిత

    కేవలం రాజకీయ ఆరంగేట్రమే కాదు, గుడిపాటి సీతారామ్‌కు సమాజంలో మంచి గుర్తింపు ఉంది. రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా రాణించిన ఆయన, యువతలో క్రీడలను ప్రోత్సహించడానికి ‘గుడిపాటి ఫౌండేషన్’ స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ఎందరో నిరుపేదలకు నిత్యావసరాలు అందించడం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడమే కాకుండా.. ప్రతిభావంతులైన పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం చేస్తూ రియల్ హీరోగా నిలిచారు.

    ap-news-the-family-praised-by-modi-now-joins-janasena
    ap-news-the-family-praised-by-modi-now-joins-janasena

    మరోవైపు శ్రీలలిత సంగీత రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటివరకు అమ్మవారిపై 70కి పైగా పాటలు పాడిన ఆమె, ‘కాంతార’ సినిమాలోని వారాహ రూపం కవర్ సాంగ్‌తో యూట్యూబ్‌ను షేక్ చేశారు. ప్రస్తుతం ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి టీమ్‌లో పనిచేస్తున్న శ్రీలలిత, భావి తరాలకు ఆదిశంకరాచార్యుల కృతులను అందించే లక్ష్యంతో ఉన్నారు. తన భర్త సీతారామ్ సహకారంతో భగవద్గీత సారాంశాన్ని ఏఐ సాంకేతికత (AI Technology) జోడించి విజువల్ వండర్‌గా మార్చే ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నారు. అంతేకాదు, మహిళా కళాకారిణులను ప్రోత్సహించడానికి ‘నారిగమ’ అనే సరికొత్త మ్యూజిక్ బ్రాండ్‌ను కూడా ఆమె ఇటీవల లాంచ్ చేశారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.