Wed. Jun 24th, 2026

    Tollywood: టాలీవుడ్ లో వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో నారా రోహిత్ తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఆయన స‌తీమ‌ణి శిరీష పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రాగానే అటు నారా కుటుంబంలో, ఇటు నందమూరి ఇంట పండగ వాతావరణం నెలకొంది. సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ సెలబ్రిటీలు నారా రోహిత్ దంప‌తుల‌కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

    నారా రోహిత్, శిరీషలది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. ‘ప్రతినిధి 2’ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య చిగురించిన పరిచయం, ఆ తర్వాత కాలంలో బలమైన ప్రేమగా మారింది. ఇరువైపులా పెద్దలను ఒప్పించి గతేడాది అక్టోబర్‌లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లయిన ఏడాది తిరక్కుండానే వీరి జీవితంలోకి కొత్త అతిథి, నారా వారసుడు అడుగుపెట్టడంతో రోహిత్ వ్యక్తిగత జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలను అనుభవిస్తున్నారు.

    tollywood-nara-rohith-blessed-with-a-baby-boy
    tollywood-nara-rohith-blessed-with-a-baby-boy

    Tollywood: కెరీర్ పరంగా కూడా నారా రోహిత్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

    కాగా, ఒకవైపు తండ్రిగా సరికొత్త బాధ్యతలు స్వీకరిస్తూనే, మరోవైపు కెరీర్ పరంగా కూడా నారా రోహిత్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటీవలే ‘సుందరకాండ’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన, ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్టులో భాగమయ్యారు. విక్టరీ వెంకటేష్, క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో రోహిత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. దసరా కానుకగా రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనితో పాటు సోలో హీరోగా మరో కొత్త ప్రాజెక్ట్‌ను కూడా ఆయన లైన్‌లో పెట్టారు. ఇలా అటు పర్సనల్ లైఫ్‌లో బాబు రాక, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌లో వరుస ఆఫర్లతో నారా రోహిత్ కెరీర్ ఇప్పుడు టాప్ గేర్‌లో దూసుకుపోతోంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.