Chicken: సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదని మన పెద్ద వాళ్ళు చెబుతుంటారు. జ్వరం వచ్చిన సమయంలో చికెన్ తినడం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయని అందుకే జ్వరం వచ్చిన సమయంలో చికెన్ తినకూడదని చెబుతూ ఉంటారు. చాలా మంది ఇలాంటి సమయంలో చికెన్ తినడానికి భయపడుతూ ఉంటారు. నిజంగానే జ్వరం ఉన్నప్పుడు చికెన్ తినకూడదా? తింటే ఏమవుతుంది? ఈ విషయం పట్ల నిపుణుల అభిప్రాయం ఏంటీ? అనే విషయానికి వస్తే..
జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదనే విషయం పూర్తిగా ఆ వాస్తవమని నిపుణులు చెబుతున్నారు. జ్వరం వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి సందేహాలు లేకుండా చికెన్ తినచ్చని చెబుతున్నారు. అయితే మనకు జ్వరం వచ్చిన సమయంలో చికెన్ తినేటప్పుడు ఖచ్చితంగా మసాలాలు కాస్త తగ్గించుకొని చికెన్ మెత్తగా ఉడికించుకొని తినటం వల్ల ఎలాంటి సమస్య ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చికెన్ లో ఉండే పోషకాలు మన శరీరానికి బలాన్ని అందిస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంపొందింప చేస్తాయి. జ్వరం వచ్చిన సమయంలో శరీరం కాస్త నీరసపడుతుంది అలాంటి సమయంలో చికెన్ బాగా ఉడికించి తినటం వల్ల మన శరీరానికి బలం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Chicken: జ్వరం వస్తే చికెన్ తినవచ్చు..
జ్వరం వచ్చిన సమయంలో బయట తయారుచేసిన చికెన్ తినడం కంటే కూడా ఇంట్లో శుభ్రంగా వండుకొని తినడం ఎంతో మంచిది..అయితే చికెన్ బాగా ఉడికించి తినటం వల్ల తొందరగా జీర్ణం అవుతుంది. తద్వారా ఎలాంటి జీర్ణ క్రియ సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఇక జ్వరం వచ్చిన సమయంలో చికెన్ ఫ్రై, కబాబ్ వంటి వాటిని తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చికెన్ ఫ్రై, కబాబ్, నూనెలో వేయించిన వాటిని తినటం వల్ల జీర్ణం అవ్వడానికి ఆలస్యం అవుతుంది అందుకే ఇలాంటి పదార్థాలకు దూరంగా ఉంటూ బాగా ఉడికించిన చికెన్ తీసుకోవటం మంచిది. ఈ జాగ్రత్తలను పాటిస్తూ జ్వరం వచ్చినప్పుడు కూడా చికెన్ తినడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు.

