Fri. Jun 19th, 2026

    Tollywood: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లనే సాధించినప్పటికీ.. నార్త్ బెల్ట్, ఓవర్సీస్ మార్కెట్లలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లెక్కలపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ తీసుకున్న భారీ పారితోషికం, అందులో ఆయన చేసిన త్యాగం ఇప్పుడు హాట్ డిస్కషన్‌కు దారితీసింది.

    ఈ సినిమా కోసం రామ్ చరణ్ దాదాపు రూ. 120 కోట్ల భారీ రెమ్యునరేషన్‌ను అగ్రిమెంట్ చేసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. అయితే, సినిమా అనుకున్న రేంజ్‌లో హిట్టు కాకపోవడం, విదేశాల్లో ఆశించిన అంకెలు రాకపోవడంతో నిర్మాత సేఫ్ జోన్‌లోకి రావడం కోసం చరణ్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నట్లు సమాచారం. అగ్రిమెంట్ ప్రకారం సినిమా పూర్తయిన తర్వాత నిర్మాత నుంచి చరణ్‌కు అందాల్సిన పారితోషికంలో ఒక పెద్ద మొత్తాన్ని ఆయన వెనక్కి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అంటే.. బాక్సాఫీస్ దగ్గర ‘పెద్ది’ అనుకున్నంత రేంజ్ అందుకోకపోవడంతో వచ్చిన నష్టాన్ని పూడ్చేందుకు, నిర్మాతకు ఊరట కలిగించేందుకు చరణ్ తన సొంత లాభాన్ని వదులుకున్నాడ‌ట‌.

    tollywood-the-peddi-blow-did-ram-charan-lose-rs-120-crore
    tollywood-the-peddi-blow-did-ram-charan-lose-rs-120-crore

    Tollywood: రామ్ చరణ్ మాత్రమే కాకుండా, దర్శకుడు బుచ్చిబాబు సైతం

    కేవలం రామ్ చరణ్ మాత్రమే కాకుండా, దర్శకుడు బుచ్చిబాబు సైతం నిర్మాత శ్రేయస్సు కోరి తన రెమ్యునరేషన్‌లో కొంత భాగాన్ని వదులుకున్నట్లు ఇన్‌సైడ్ టాక్. నార్త్, ఓవర్సీస్ మార్కెట్లలో లెక్కలు సరిగ్గా కుదిరి ఉంటే ‘పెద్ది’ రేంజ్ వేరేలా ఉండేది అని నిర్మాత సతీష్ కూడా బహిరంగంగానే అంగీకరించారు. అయితే, కమర్షియల్ అంకెలు ఎలా ఉన్నప్పటికీ.. ఒక నటుడిగా రామ్ చరణ్‌కు ఈ సినిమాతో అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. మెగాస్టార్ చిరంజీవి సైతం చరణ్‌లోని నటనను పూర్తి స్థాయిలో చూడటం సంతోషాన్ని ఇచ్చిందని ప్ర‌త్యేకంగా అభినందించారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.