Thu. Jun 11th, 2026

    Parama Ekadashi : ఏకాదశి ఎంతో విశిష్టమైన రోజుగా భావిస్తాము అయితే ప్రతి నెల ఏకాదశి వస్తుంది కానీ కొన్ని ఏకాదశి లకు ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. ఇక నేడు జరుపుకోవాలని ఈ పరమ ఏకాదశి చాలా విశిష్టమైనదని చెప్పాలి ఈ ఏకాదశి మూడు సంవత్సరాలకు ఒకసారి రావడం విశేషం. అధిక జేష్ట మాసంలో ఈ ఏకాదశి వస్తుంది. ఈ పరమ ఏకాదశి రోజున భక్తులు విష్ణుమూర్తిని పూజించి ఉపవాసాలు ఉండటం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయిని పండితులు చెబుతున్నారు.

    ఈ పవిత్రమైన రోజున ఉదయమే తల స్నానం చేసి లక్ష్మి విష్ణు చిత్రపటాన్ని అలంకరించుకొని పూజ ప్రారంభించాలి. స్వామివారికి ఇష్టమైన వడపప్పు నా ఇది దీన్ని సమర్పించి పూజ చేసుకోవాలి. అయితే ఈరోజు ఉపవాసం ఉండేవారు కొన్ని నియమాలను కూడా పాటించాలి. ఉపవాసం ఉన్నవారు స్వామివారికి తెలిసి దళాలతో పూజ చేయడం అత్యంత శ్రేష్టం. ఉపవాస సమయంలో ఎటువంటి చెడు మాటలు మాట్లాడకుండా స్వామివారి మంత్రాలను జపిస్తూ ఉండాలి. ఇతరులపై కోపాన్ని ప్రదర్శించకూడదు. నేలపైనే పడుకోవాలి, మాంసాహారానికి దూరంగా ఉండాలి, తులసి మొక్కను ఎట్టి పరిస్థితులలో తుంచడం తాకడం వంటివి చేయకూడదు.

    parama-ekadashi-comes-once-in-3-years-know-the-pooja-details
    parama-ekadashi-comes-once-in-3-years-know-the-pooja-details

    Parama Ekadashi: పరమ ఏకాదశి తిథి సమయం

    ఇలా ఈ నియమాలను పాటిస్తూ ఏకాదశి వ్రతం చేసుకోవచ్చు ఉపవాసం ఉన్నవారు ఏకాదశి తిథి పూర్తి అయిన తర్వాతనే ఉపవాసం వదలాలి. ఈ ఏకాదశి తిథి జూన్ 10, 2026 రాత్రి 12:57 గంటలకు ప్రారంభమై, జూన్ 11 రాత్రి 10:36 గంటలకు ముగుస్తుంది. పురాణాల ప్రకారం పరమే ఏకాదశి రోజున యక్షుల ప్రభువైన కుభేరుడు ఈ వ్రతాన్ని ఆచరించినప్పుడు శివయ్య సంతోషించి తనని సంపదకు అధిపతిగా చేస్తాడు. అందువల్లనే మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పరమ ఏకాదశి రోజున ఈ వ్రతం ఆచరించడం వల్ల వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భావిస్తారు. ఈ వ్రతం ఆచరించేవారు దానధర్మాలను చేయటం ఎంతో మంచిది.