Tue. Jun 9th, 2026

    TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద ఎత్తున విరాళాలను భక్తులు అందజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారికి వచ్చే విరాళాల ద్వారా టీటీడీ ఎన్నో రకాల సహాయ సహకారాలను అందజేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది .టీటీడీ ఖాతాకు జమవుతున్న విరాళాలు ఎన్నో ప్రాణాలను సైతం నిలబెడుతున్నాయి. భక్తులు అందిస్తున్న విరాళాల ద్వారా టీటీడీ కొన్ని ట్రస్టులను నిర్వహిస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు. ఇందులో భాగంగానే ఎస్ వి ఆపన్న హృదయ పథకం ద్వారా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లను నిర్వహిస్తున్నారు.

    ఇలా ఆపన్న హృదయ పథకం ద్వారా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లను నిర్వహిస్తూ ఇప్పటికే ఎంతోమందికి పునర్జన్మను ప్రసాదించారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో టిటిడి భక్తులను కూడా భాగస్వామ్యం చేయాలని నిర్ణయం తీసుకుంది.రూ. లక్ష చెల్లిస్తే శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం, వసతి, లడ్డు ప్రసాదం అందజేయనున్నారు. ఈ విధంగా విఐపి బ్రేక్ దర్శనం కావాలనుకుని భక్తులు ఆపన్న హృదయ పథకానికి లక్ష రూపాయలను విరాళం అందజేస్తే చాలు.ప్రాణదానం ట్రస్ట్ కింద ఎస్ వి ఆపన్న హృదయ పథకం అమలవుతోంది.

    TTD: 5మందిని వీఐపీ బ్రేక్ దర్శనం..

    ఈ పథకానికి విరాళాలు ఇచ్చే దాతలకు టీటీడీ ప్రత్యేకంగా వీఐపీ బ్రేక్ దర్శన అవకాశాలను కల్పిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా భక్తులకు పలు ప్రయోజనాలు కల్పిస్తోంది. ఒకరు లక్ష రూపాయలు చెల్లిస్తే చాలు వారితో పాటు మరో 5 మందికి విఐపి బ్రేక్ దర్శనం, ఉచితంగా స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేస్తున్నారు.సెక్షన్ 80G కింద ఆదాయపు పన్ను మినహాయింపు కూడా పొందే ఛాన్స్ ఉంది. టిటిడిని నేరుగా లేదంటే ⁠TTD అధికారిక వెబ్‌సైట్ లో ఆపన్న హృదయ స్కిమ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.