Tue. Jun 2nd, 2026

    Health care:  ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య ఒకటి. మారుతున్న ఆహారపు అలవాట్లు కారణంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల ప్రతి పది మందిలో దాదాపు 7 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇలా డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న వారు ఆహారపు విషయంలో ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని రకాల పండ్లను తినకూడదనే అపోహలో ఉంటున్నారు. అలాంటి వాటిలో అరటిపండు ఒకటి. అరటిపండు తినటం వల్ల శరీరంలో చక్కర స్థాయిలో పెరుగుతాయనే అపోహలో ఉంటున్నారు. మరి నిజంగానే డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న వారు అరటిపండు తినకూడదా? అనే  విషయానికి వస్తే..

    పోషకాల గని అరటి..

    అరటి పండు పోషకాల గని అని చెప్పవచ్చు అరటి పండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి6, విటమిన్ సి , ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ వంటి ముఖ్యమైన పోషకాలు మన శరీరానికి ఎంతగానో దోహదం  చేస్తాయి. డైటీషియన్ల ప్రకారం డయాబెటిక్ ఉన్నవారు అరటి పండు తినకూడదు అనేది కేవలం ఒక అపోహ మాత్రమే అని తెలిపారు. డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న వారు కూడా ప్రతిరోజు ఒక అరటిపండు తినవచ్చు అయితే అరటిపండు తినే విధానంలో మార్పులు ఉంటాయని తెలిపారు.

    ఈ సమయంలో తినొద్దు..

    డయాబెటిక్ సమస్యతో బాధపడేవారు అరటి పండు తినాలి అనుకుంటే ఉదయం మాత్రమే అరటిపండు తినాలి. ఇందులో సహజ చక్కరలు ఎక్కువగా ఉండటం వల్ల దాని ప్రోటీన్ మూలంతో కలిపి తీసుకుంటే చాలా మంచిదని తెలిపారు. ఇతర ప్రోటీన్ ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో ఇలాంటి షుగర్ లెవెల్స్ పెరగటానికి అవకాశం ఉండదు. అయితే బాగా పండిన అరటి పండ్లను మాత్రం డయాబెటిక్ సమస్యతో బాధపడే వారు తినకూడదు. అరటిపండు పై గోధుమ రంగు మచ్చలు ఎక్కువగా ఉంటే అలాంటి అరటి పండ్లును తినకూడదు అదే విధంగా డయాబెటిక్ సమస్యతో బాధపడేవారు రాత్రిపూట అరటిపండ్లు తినకపోవడం చాలా మంచిది. మన శరీరానికి ఎన్నో మంచి పోషకాలను అందించే అరటిపండు డయాబెటిక్ పేషెంట్లు నిరపింతరంగా తినవచ్చు కానీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహా మేరకు అరటిపండును తీసుకోవడం మంచిది.