Sai Pallavi: ఫిదా బ్యూటీ సాయి పల్లవికి బాలీవుడ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె నటించిన మొదటి సినిమా డిజాస్టర్ టాక్ ని తెచ్చుకోవడం అటు నార్త్ బెల్ట్ లో ఇటు సౌత్ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చగా మారింది. తెలుగు, తమిళ భాషలలో ఎంతో సెలెక్టెడ్ గా సినిమాలను ఎంచుకుంటోంది సాయి పల్లవి. ఫిదా మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత తనకి ఫిదా బ్యూటీ అనే ట్యాగ్ ని తగిలించారు. ఏమాత్రం అందాల ఆరబోతకి అవకాశం ఇవ్వకుండా, ఘాటు రొమాన్స్..పెదవి ముద్దులకి సై అనకుండా స్టార్‌డం తెచ్చుకుంది.
లవ్‌స్టోరీ లాంటి సూపర్ హిట్ తర్వాత తండేల్, అమరన్ లాంటి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. తెలుగు, తమిళ భాషలలో తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ క్రేజ్ తో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. అక్కడ రామాయణ రెండు భాగాలలో నటిస్తోంది. సీత పాత్రలో రణ్‌బీర్ కపూర్ సరసన అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది దీపావళికి పార్ట్ 1, 2027 దీపావళికి రామాయణ పార్ట్ 2 రాబోతున్నాయి. సాయి పల్లవి కలలో కూడా ఊహించని ప్రాజెక్ట్ రామాయణ అని చెప్పక తప్పదు. అయితే, దీనికంటే ముందే వచ్చిన సినిమాతో సూపర్ హిట్ అందుకుంటుందనే నమ్మకంతో ఉన్న ఈ నేచురల్ బ్యూటీకి గట్టి షాకే తగిలింది.

Sai Pallavi: ఏక్ దిన్ సినిమాతో సాయి పల్లవి బాలీవుడ్ కి పరిచయమైంది.
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ కొడుడు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఏక్ దిన్ సినిమాతో సాయి పల్లవి బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆమిర్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థలో నిర్మించారు. దాంతో, ముందు నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మేడే సందర్భంగా 1వ తేదీన ఏక్ దిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదనే టాక్ వచ్చింది. మొదటి రోజు వసూళ్ళు చూసి అందరూ షాకవుతున్నారు. ఆమిర్ ఖాన్ సొంత సంస్థ, సాయి పల్లవి ఉన్నప్పటికీ..ఈ మూవీకి ఘోరమైన ఓపెనింగ్స్ వచ్చాయి. బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ ఎవరూ కూడా ఊహించని కలెక్షన్స్ అని చెప్పాలి. సాయి పల్లవి డెబ్యూ మూవీ కాబట్టి, మొదటిరోజు మంచి ఓపెనింగ్స్ ఉంటాయనుకున్నారు.
కానీ, సీన్ మొత్తం రివర్స్ అయింది. మన సౌత్ హీరోయిన్స్ చాలామంది బాలీవుడ్ ఇండస్ట్రీ మీద బోలెడన్ని ఆశలు పెట్టుకొని వెళ్ళి చేసిన సినిమాలేవి కలిసి రాలేదు. కీర్తి సురేష్, పూజా హెగ్డే, శ్రీలీల..ఇలా చాలామంది ఉన్నారు. ఇటీవల కాలంలో ఒక్క రష్మిక మందన్న మాత్రమే అక్కడ క్రేజీ హీరోయిన్ అనిపించుకుంది. పర్ఫార్మెన్స్ పరంగా సౌత్ లో సాయి పల్లవికి ఉన్న పాపులారిటీ అక్కడ పనిచేయలేదు. మరి, రామాయణ సినిమాకి ఇది ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో తెలీదు గానీ, కొంత నెగిటివిటీ మాత్రం మొదలైంది. మొత్తానికి, సాయి పల్లవికి మొదటి హిందీ సినిమా ఊహించని షాకిచ్చింది.

