Kushitha : కుషిత కల్లపు ఈ పేరు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉన్న ఖుషిత డ్రగ్స్ కేసుతో బాగా ఫేమస్ అయ్యింది. తాము పబ్‌కి డ్రగ్స్ తీసుకోవడానికి వెళ్లలేదని, చీజ్ బజ్జీలు తినడానికని వెళ్లామని చెప్పి బజ్జీల పాపగా క్రేజ్ తెచ్చుకుంది. అప్పటి నుంచి ఇటు ఇండస్ట్రీ లో అటు సోషల్ మీడియాలో అమ్మడి పేరు ఓ మోతమోగిపోతోంది. అమ్మడికి పాపులరిటీ రావడంతో ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఖుషిత జాతకం చెప్పుకొచ్చాడు. దీనికి తాజాగా బజ్జీల పాప కౌంటర్ ఇచ్చింది.
సినీ సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ ఆస్ట్రాలజర్ వేణుస్వామి బాగా ఫేమస్ అయ్యారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జాతకం చెప్పి నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నారని నెట్టింట్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అప్పట్లో నాగచైతన్య, సమంత డివోర్స్ తీసుకుంటారని చెప్పి సంచలనం సృష్టించారు. దీనితో ఆయన పేరు ఒక్కసారిగా మారుమోగింది. ఇక అప్పటి సినీ తారల జీవితాల్లో జరిగే సంగతులు చెబుతూ నెట్టింట్లో వైరల్ అవుతున్నారు.
ఈ క్రమంలో కుషిత డ్రగ్స్ కేసుపైన వేణుస్వామి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.” కొన్ని నెలల్లో కుషిత బాగా ఫేమస్ అవుతుంది. నేను , చెప్పినట్లుగానే ఆమె డ్రగ్స్ కేసుతో పాపులరిటీ సంపాదించుకుంది”అని అయన చెప్పారు. అయితే రీసెంట్ గా ఆయన కామెంట్స్‌పై కుషిత రియాక్ట్ అయ్యింది. “వేణు స్వామిని డ్రగ్స్ కేసు తర్వాతే కలిశాను , దానిని తనకు అనుగుణంగా ఎలా మార్చుకుంటారు. దీనిని బట్టి వేణుస్వామి పెద్ద బిల్డప్ బాబాయ్‌లా ఉన్నాడు”. అని కుషిత చెప్పింది. ఇదిలా ఉంటే ఖుషిత ప్రస్తుతం ‘బాబు నెం.1 బుల్ షిట్ గయ్’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాతో ఇప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న ఖుషిత టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.