Wed. Feb 11th, 2026

    Nandita Swetha: బోల్డ్ సీన్స్ ఉన్న కథలతో రండి సైన్ చేస్తా..అంటుందట గ్లామర్ బ్యూటీ నందిత శ్వేత. ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీకి “ఎక్కడికి పోతావు చిన్నవాడా” అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను మాత్రం బాగానే ఆకట్టుకుంది. అయినా మేకర్స్ ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు ఇవ్వలేదు.

    వచ్చిన అవకాశాలేవీ నందితని స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టలేకపోయాయి. ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ మీద సందడి చేస్తూ తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆర్ ఎక్స్ 100 సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి తన మూడవ సినిమాగా మంగళవారం తెరకెక్కించారు. మధ్యలో వచ్చిన మహా సముద్రం ఊహించని షాకిచ్చింది. అయినా మళ్ళీ పాయల్ రాజ్‌పుత్ ని నమ్ముకొని మంగళవారం చేశారు.

    nandita-swetha-Come and sign stories with bold scenes..!
    nandita-swetha-Come and sign stories with bold scenes..!

    Nandita Swetha: బోల్డ్ సీన్స్ ఉంటే కథ ఒప్పుకుంటా

    త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. పాయల్ ఆర్ ఎక్స్ 100 సినిమాలో ఎంతగా రొమాంటిక్ సీన్స్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత పాయల్ కి కూడా హిట్ దక్కలేదు. అజయ్ పరిస్థితి అంతే. మళ్ళీ వీరి కాంబినేషన్‌లో మంగళవారం వస్తోంది. ఈ సినిమాలో కూడా కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయట. అవి పాయల్ మాత్రమే చేస్తుందని ప్రమోషన్స్‌లో అజయ్ భూపతి చెపుకొచ్చారు.

    ఇప్పుడు అలాంటి సీన్స్ చేయడానికి నేనూ రెడీ అంటోంది నందిత శ్వేత. ఈమె కూడా మంగళవారం సినిమాలో నటించింది. వాస్తవానికి అజయ్ భూపతి ఆర్ ఎక్స్ 100 సినిమాలో పాయల్ కంటే ముందు నందిత నే అడిగారట. కానీ, ఆమె అలాంటి సీన్స్ చేయలేనని నో చెప్పిందట. ఇది నందిత వర్షన్. కానీ, అజయ్ చెప్పింది..నేను కొత్త దర్శకుడిని కాబట్టి బెడ్రూం సీన్స్ సరిగ్గా తీయగలనో లేదో అని రిజెక్ట్ చేసిందీ అని. ఏదేమైనా అజయ్ మళ్ళీ నందితకి మంగళవారం సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఆమె కూడా ఇప్పటి నుంచి బోల్డ్ సీన్స్ ఉంటే కథ ఒప్పుకుంటా..అని ఓపెన్ అవడం. మరి ఆ దర్శకులెవరో నందిత శ్వేతతో సినిమా ఎప్పుడు చేస్తారో చూడాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.