Thu. Nov 13th, 2025

    Mrunal thakur : బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వరుస ఆఫర్లతో ఫుల్ జోష్ లో ఉంది సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఓవైపు మూవీస్ మరోవైపు వెబ్ సిరీస్‌లేలోనూ నటిస్తూ స్పీడ్ పెంచేసింది. మృణాల్ చేతిలో అరడజను వరకు సినిమాలు ఉన్నాయి. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మృణాలు ఫ్యాషన్ కు కాస్త సమయాన్ని కేటాయిస్తోంది. తన ఒంపు సొంపులను చూపిస్తూ కుర్రాళ్ళ హృదయాలను దోచేస్తోంది.

    mrunal-thakur-latest-ethnic-photoshoot-pics-going-viral
    mrunal-thakur-latest-ethnic-photoshoot-pics-going-viral

    సీతారామం సినిమా తర్వాత మృణాలు చేస్తున్న మూవీ హాయ్ నాన్న. నేచురల్ స్టార్ నాని జోడి కట్టిన ఈ మూవీ డిసెంబర్ 21న విడుదల కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ టీమ్ అంతా కూడా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. మృణాల్ కూడా నేనేం తక్కువ కాదంటూ తనదైన స్టైల్ లో ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తోంది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.

    mrunal-thakur-latest-ethnic-photoshoot-pics-going-viral
    mrunal-thakur-latest-ethnic-photoshoot-pics-going-viral

    సినిమాల విషయం పక్కన పెడితే అటు సోషల్ మీడియాలో నూ మృణాల్ రచ్చ రచ్చ చేస్తుంది. అందాల ఆరబోతతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ పిక్స్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    mrunal-thakur-latest-ethnic-photoshoot-pics-going-viral
    mrunal-thakur-latest-ethnic-photoshoot-pics-going-viral

    మృణాల్ ఠాకూర్ పచ్చని హాఫ్ లెహంగా సెట్‌ను ధరించింది. ఎత్నిక్ లుక్ లో ఆదరగొట్టింది. ఈ అద్భుతమైన అవుట్ ఫిట్ వేసుకుని చేసిన హాట్ ఫోటోషూట్ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో ఈ బ్యూటీ ఈ పిక్స్ ను వరుసగా వదిలింది. “లవ్ అండ్ లైట్” అనే క్యాప్షన్‌తో తన ఫోటోలను పోస్ట్ చేసింది. అందరినీ విస్మయానికి గురిచేస్తూ తన అభిమానులను ఆకట్టుకుంది.

    mrunal-thakur-latest-ethnic-photoshoot-pics-going-viral
    mrunal-thakur-latest-ethnic-photoshoot-pics-going-viral

    మృణాల్ ఠాకూర్ పాపా డోంట్ ప్రీచ్ బ్రాండ్‌కు చెందిన అవుట్ ఫిట్ ధరించింది. బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం మృణాల్ వేసుకున్న ఈ అవుట్ ఫిట్ ధర దుస్తుల ధర రూ. 1,50,000.

    mrunal-thakur-latest-ethnic-photoshoot-pics-going-viral
    mrunal-thakur-latest-ethnic-photoshoot-pics-going-viral