Vijay – Rashmika : రష్మిక పేరు వినగానే భారీ బడ్జెట్ సినిమాలతో పాటూ హీరో విజయ్ దేవరకొండ కూడా గుర్తొస్తాడు. ఎందుకంటే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని ఎప్పటి నుంచో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ జంట తమ రిలేషన్‌ను చాలా ప్రైవేట్‌గా ఉంచేసింది. సెల్ఫీలు, ట్రిప్స్ షేర్ చేస్తున్నా – పబ్లిక్‌గా కలిసి కనిపించడం చాలా అరుదు. అప్పుడప్పుడూ మీడియా కంటపడిన వీడియోలు మాత్రం వైరల్ అవుతుంటాయి.
ఇటీవల రష్మిక కొంచెం ఓపెన్ అవుతూ కనిపిస్తోంది. తన అభిప్రాయాల్లో విజయ్‌పై ఉన్న సానుభూతిని వెలిబుచ్చుతోంది. ఒక ఫంక్షన్‌లో మాట్లాడుతూ “తాను ఇండస్ట్రీలోని వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను” అని చెప్పింది. అప్పటి నుంచి అందరి దృష్టి విజయ్ దేవరకొండవైపే వెళ్లింది.
ఇక ఇటీవల జరిగిన ‘కుబేర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక, “విజయ్ దగ్గర నుంచి అన్నీ తీసేసుకుంటా” అని సరదాగా కామెంట్ చేసింది. ఇప్పుడు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వీరిద్దరూ ఒకే కారులో కనిపించడంతో ఫ్యాన్స్ మళ్లీ ఊహాగానాలు చేయడం మొదలుపెట్టారు “ఇప్పుడు లవ్ కన్ఫర్మేనా?” అని చర్చించుకుంటున్నారు.

Vijay – Rashmika :
కెరీర్ విషయానికొస్తే…
రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్‌గా ఎదిగింది. ‘యానిమల్’, ‘పుష్ప 2’, ‘ఛావా’ సినిమాలతో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించింది. ఇక ‘కుబేర’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరోవైపు ఆమె నటించిన ‘గర్ల్‌ఫ్రెండ్’, ‘థామా’ వంటి సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి.
విజయ్ దేవరకొండ విషయానికొస్తే, పెద్ద హిట్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు ఆయన దృష్టంతా ‘కింగ్డమ్’ సినిమాపైనే ఉంది. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా చివరికి జూలై 25న రిలీజ్ కావడానికి సిద్ధమవుతోందని టాక్.
చూడాలి మరి… కెరీర్‌లోనూ, లవ్ లైఫ్‌లోనూ ఈ జంటకి ఏం జరగబోతోందో!