Indian Cinema: సినీ తారలు పబ్లిక్‌లో కనిపిస్తే ఎలాంటి వెకిలి చేష్టలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోయిన్స్ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వచ్చినప్పుడు ఎంత సెక్యూరిటీ ఉన్నా సందట్లో సడేమియా అంటూ తాకరాని చోట తాకిన సందర్భాలు చాలామందికి ఎదురయ్యాయి. సమంత చాతిపై చేయి వేసిన వీడియో తో పాటు పలువురు హీరోయిన్స్ మీద చేతులు వేసిన వీడియోలు నెట్టింట ఉన్నాయి. ఆ మధ్య శ్రీలీల హిందీ సినిమా షూటింగ్ చేసి వస్తుంటే ఆకతాయిలు ఆమె చేయి పట్టుకొని లాక్కెళ్ళారు.
ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే, తాజాగా ముంబైలో జిమ్ నుంచి సమంత బయటకు వచ్చింది. కారు ఎక్కుదామని అలా నడుచుకుంటూ వస్తున్న సమయంలో కొందరు ఫొటో గ్రాఫర్స్ ఆమెపై ఒక్కసారిగా ఎగబడ్డారు. సమంత మాడం అని పిలుస్తూ ఫొటోలు తీశారు. కారు ఇంకా రాలేదని చెప్పగానే తిరిగి జిమ్ లోకి వెళ్ళారు. ఆ సమయంలో ఎంతో అసహనానికి గురైన సామ్ ‘అరే రూకోజి ప్లీజ్’ అంటూ కోపంగా చూసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Indian Cinema: హని బన్నీ తో మంచి సక్సెస్ అందుకుంది సమంత.
సెలబ్రిటీస్ కి ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం చాలా సహజం. కానీ, కొన్ని సందర్భాలలో మరీ శృతిమించి ప్రవర్తించడం వల్ల తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాగా, సమంత నిర్మాతగా ఇటీవల శుభం అనే సినిమా వచ్చి మంచి హిట్ సాధించింది. ఇందులో తాను కూడా ఓ కీలక పాత్రలో కనిపించారు. ఖుషి తర్వాత మళ్ళీ తెలుగులో సినిమాలు చేయలేదు. సీటాడెల్ హని బన్నీ తో మంచి సక్సెస్ అందుకుంది సమంత.
ప్రస్తుతం రాజ్ నిడిమోరు తెరకెక్కిస్తున్న రక్త్ బ్రంహాండ్ అనే సిరీస్‌లో నటిస్తోంది. అలాగే, మరికొన్ని సినిమాలు లైన్‌లో ఉన్నాయి. నాగ చైతన్యతో విడిపోయాక మళ్ళీ సమంత పెళ్ళి ఊసే ఎత్తడం లేదు. కానీ, రాజ్ నిడిమోరుతో మాత్రం రిలేషన్‌లో ఉందని వార్తలు వస్తున్నాయి. అలాగే, వరుణ్ ధావన్‌తో కూడా ప్రేమలో ఉన్నట్టు మీడియాలో కథనాలు వచ్చి వైరల్ అవుతున్నాయి. తాను మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా కమిటైన ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు.
Rarely see her get irritated or angry even when disturbed she usually remains cool n composed. That's a quality we need to inculcate taking from her✨@Samanthaprabhu2 #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/9SMBRoYzxy
— AkaSam (@SammuVerse) June 17, 2025