Tollywood Trending: టాలీవుడ్ క్రేజీ బ్యూటీస్ శ్రీలీల, సాయి పల్లవితో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా ఓ లేటెస్ట్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు, ఇది డాన్స్ బేస్డ్ గా సాగే కథ అని సమాచారం. సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేమమ్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. అంతకముందే, ఢీ డాన్స్ షో ద్వారా సాయి పల్లవి మన తెలుగు ప్రేక్షకులకి పరిచయమే.
ఫిదా, లవ్ స్టోరీ, విరాట పర్వం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది. కథ, అందులో ఆమె పాత్ర చాలా నీట్‌గా ఉంటేనే సినిమాను ఒప్పుకుంటుంది సాయి పల్లవి. గ్లామర్ రోల్స్ చేయాలీ అంటే అలాంటి అవకాశాలేవీ నాకవసరం లేదనుకుంటుంది. అలాంటి పరిస్థితే వస్తే ఊరెళ్ళిపోయి డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసుకుంటా.. అని పలు సందర్భాలలో చెప్పింది. అందుకే, సాయి పల్లవితో సినిమా చేయాలనుకుంటే మంచి కథతోనే మేకర్స్ అప్రోచ్ అవుతున్నారు.
ఇక శ్రీలీల.. ఇప్పుడు తెలుగులో బిజీ హీరోయిన్. నిండా 22 ఏళ్ళు కూడా లేని ఈ కుర్రభామ ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్‌గా మారింది. శ్రీలీల కూడా మాస్ ఆడియన్స్ ని తన డాన్స్ పర్ఫార్మెన్స్‌తో బాగా ఆకట్టుకుంటోంది. పంజా వైష్ణవ్ తేజ్ సరసన ఈ భామ నటించిన లేటెస్ట్ మూవీ ఆదికేశవ. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
ఇటీవల విడుదలైన లీలమ్మో సాంగ్ యూట్యూబ్ లో ఇప్పుడు దుమ్ము దులుపుతోంది. అయితే, ఇప్పుడు శ్రీలీల, సాయి పల్లవిలతో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించాలని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. ఇద్దరికీ సరిపోయే కథ, అది కూడా పూర్తిగా డాన్స్ బేస్డ్ గా ఉండాలని దర్శక రచయితలకి సూచించినట్టుగా ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దిల్ రాజు అనుకుంటే చేసేయడం పెద్ద పనేమీ కాదు. కాబట్టి త్వరలో దిల్ రాజు నిర్మాణంలో సాయి పల్లవి, శ్రీలీల కలిసి ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయడం పక్కా అని చెప్పుకుంటున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.