Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్). తన 19వ సినిమాను సొంత బ్యానర్ ‘విజయదుర్గ ప్రొడక్షన్స్’లో నటిస్తూ.. సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన చిత్ర బృందం, హీరోకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా వదిలారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటే, సాయి దుర్గా తేజ్ ఈ మూవీలో ఓ యోధుడి పాత్రను పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓ దట్టమైన అడవిలో ఆకాశం వైపు చూస్తున్న ఒక యోధుడిలా కనిపిస్తున్న ఈ ప్రీ లుక్ ప్రస్తుతం మెగా అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది బాగా వైరల్ అవుతోంది.

మెగా హీరోలలో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న సినిమాలు చాలా సెలెక్టెడ్‌గా ఉంటున్నాయి. డిఫరెంట్ జోనర్ సినిమాలతో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. యాక్సిడెంట్ తర్వాత కాస్త సినిమాల ఊపు తగ్గిన మాట వాస్తవం అయినప్పటికీ, కథల పరంగా మాత్రం ఏవిధంగానూ.. తొందరపడకుండా ఆలోచించి ఎంచుకుంటున్నాడు. మేనమామ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన ‘బ్రో’ మూవీ కూడా అభిమానులను బాగానే ఆకట్టుకుంది. విరూపాక్ష లాంటి విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకొని హిట్ అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

megas-nephew-sai-durgha-tej-launches-his-own-banner

Sai Durgha Tej: కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాడు సాయి దుర్గా తేజ్.

ప్రస్తుతం, సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రానికి రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే ఇది భారీ పాన్-ఇండియా పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం కావడం విశేషం. కాగా, ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఈ మూవీలో హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. ఈ మూవీని సుమారు 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ క్రమంలోనే, తన 19వ చిత్రంగా సొంత నిర్మాణ సంస్థలో కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాడు సాయి దుర్గా తేజ్. ఈ సినిమాను ఇటీవల కిరణ్ అబ్బవరంతో “క” వంటి వినూత్న చిత్రాన్ని రూపొందించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శక ద్వయం సుజిత్ – సందీప్ ఎమ్ దర్శకత్వం వహించనున్నారు. సోషియో ఫాంటసీ చిత్రంగా నిర్మిస్తున్న ఈ మూవీకి సాహు గారపాటి మరో నిర్మాత కావడం విశేషం. షైన్ స్రీన్స్ బ్యానర్, ‘విజయదుర్గ ప్రొడక్షన్స్’ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో హీరోయిన్ సహా ఇతర టెక్నీషియన్స్ ఎవరనేది త్వరలోనే వెల్లడించనున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 days ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

5 days ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

5 days ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 week ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

1 week ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

1 week ago

This website uses cookies.