Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార
నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ శర్మ, మహేష్ ఆచంట, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు
కథ: పవన్ సాధినేని, వసంత్ జుర్రు
దర్శకత్వం: పవన్ సాధినేని
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్
నిర్మాతలు: సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం
నిర్మాణ సంస్థలు: గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా
విడుదల తేది: 20 నవంబర్ 2026

Tollywood: ఆకాశాన్ని అందుకోవాలంటే రెక్కలు కావాలా? కాదు, రెక్కలు తొడిగే ఒక తోడు చాలు! ఇదే మాట చెప్పే సినిమా ‘ఆకాశంలో ఒక తార’. దుల్కర్ సల్మాన్‌కు మలయాళంలో ఎంత పేరుందో, తెలుగులోనూ అంతే ఆదరణ ఉంది. కథల ఎంపికలో ప్రతిసారీ కొత్తదనం కోరుకునే ఈ హీరో, ఈసారి పవన్ సాధినేని దర్శకత్వంలో ఒక ఆసక్తికరమైన ప్రయత్నంతో వచ్చారు. సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్, రుహానీ శర్మ, స్వాసిక కీలక పాత్రల్లో కనిపించారు. నవంబర్ 19న పడిన ప్రీమియర్స్‌తో మంచి టాక్ మొదలైన ఈ సినిమా, ఇవాళ (నవంబర్ 20) థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ తార ఎంతవరకు మెరిసిందో చూద్దాం.

కథేంటంటే:

పాలలంక అనే మారుమూల పల్లె. కనీసం మౌలిక సదుపాయాలు కూడా సరిగా లేని ఆ ఊరిలో పుట్టిన కల్పన (సాత్విక వీరవల్లి) కళ్లలో మాత్రం ఆకాశమంత కల. చిన్నప్పటి నుంచే వ్యోమగామి కావాలని, అంతరిక్షంలో అడుగుపెట్టాలని కలలు కంటుంది. కానీ ఆడపిల్లకు చదువెందుకన్న పాతకాలపు ఆలోచనల తండ్రి శివయ్య (కోట జయరాం), పదో తరగతితోనే ఆమె చదువుకు ముగింపు పలుకుతాడు. అంతటితో ఆగకుండా, డ్రైవర్ కావాలని కలలు కనే మెకానిక్ కృష్ణ (దుల్కర్ సల్మాన్)తో పెళ్లి కూడా చేసేస్తాడు.

ఇక్కడే కథ అసలు మలుపు తీసుకుంటుంది. పెళ్లయ్యాక భార్య మనసులోని ఆశయం తెలుసుకున్న కృష్ణ, ఆమె కలను తన జీవిత లక్ష్యంగా మార్చుకుంటాడు. కుటుంబ సభ్యుల వ్యతిరేకతను ఎదిరించి, భార్యను తీసుకుని హైదరాబాద్ చేరుకుంటాడు. కల్పనకు ప్రతిష్టాత్మక ఐఐటీలో సీటు వచ్చేలా ప్రోత్సహిస్తూనే, ఆమె చదువు ఖర్చుల కోసం గుజరాత్ వెళ్లి రాత్రింబవళ్లు శ్రమిస్తాడు. అంతా సాఫీగా సాగుతోందనుకున్న వేళ, కల్పన చేసిన ఓ రాకెట్ ప్రయోగం విఫలమవుతుంది. అక్కడినుంచి ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ప్రైవేట్ స్పేస్ సెంటర్ అధినేత రోహిణి (శ్రుతి హాసన్), గుజరాతీ యువతి బిజిలీ (రుహానీ శర్మ) ఈ ప్రయాణంలోకి ఎలా వచ్చారు? చివరికి కల్పన తన అంతరిక్ష కలను నిజం చేసుకుందా? అదే మిగతా కథ.

Tollywood: aakasamlo-oka-tara-reviewrating

ఎలా ఉందంటే:

సినిమాకు కొత్త కథ అవసరం లేదు, చెప్పే విధానంలో నిజాయితీ ఉంటే చాలు అని ఈ సినిమా నిరూపిస్తుంది. ట్రైలర్ చూసినప్పుడే కథ ఏమిటో, క్లైమాక్స్ ఎలా ఉండబోతోందో ఎవరైనా ఊహించగలరు. ఇలాంటి కథల్లో అసలు పరీక్ష ఒక్కటే. తెలిసిన గమ్యానికి చేరే దారిలో ప్రేక్షకుడిని విసుగు లేకుండా ఎలా నడిపించారన్నదే.

ఆ పరీక్షలో దర్శకుడు పవన్ సాధినేని మంచి మార్కులే సాధించారు. ఊహించగలిగే కథను రెండున్నర గంటల పాటు కుర్చీలో కూర్చోబెట్టి చూపించడం చిన్న విషయం కాదు. భావోద్వేగాలను నమ్ముకుని, వాటిని నిజాయితీగా పండించడం ద్వారా ఆయన అది సాధ్యం చేశారు. పల్లె నేపథ్యంలోని సన్నివేశాలు, భార్యాభర్తల మధ్య బంధం, కలను నమ్మే వారికి తోడుగా నిలిచే మనుషులు, ఇవన్నీ మనసుకు హత్తుకునేలా తెరపైకి వచ్చాయి.

అయితే, కొన్నిచోట్ల కథనం నెమ్మదిస్తుంది. ముందే ఊహించగలిగే మలుపులు కూడా ఉన్నాయి. కానీ ఆ లోపాలను భావోద్వేగాల బలం, సంభాషణల లోతు కప్పేస్తాయి. ముఖ్యంగా యువతకు కనెక్ట్ అయ్యేది ఒక్కటే: “నీ కలను నమ్మేవాడు ఒక్కడు దొరికితే చాలు, ప్రపంచం ఎంత వెనక్కి లాగినా నువ్వు ముందుకు వెళ్లగలవు” అనే సందేశం.

ఎవరెలా చేశారంటే:

దుల్కర్ సల్మాన్ ఎంపికలో ఎప్పుడూ ఒక ధైర్యం కనిపిస్తుంది. హీరోయిజం, ఫైట్లు, డ్యాన్సులు లాంటి కమర్షియల్ హంగులేవీ లేని కృష్ణ పాత్రను ఒప్పుకోవడానికి నిజంగా గట్స్ ఉండాలి. ఆ పాత్రలో ఆయన హీరోగా కాకుండా ఒక మనిషిగా కనిపిస్తాడు. సెటిల్డ్ నటనతో మెప్పించాడు, ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన గుండె కదిలిస్తుంది.

మరోవైపు కొత్త హీరోయిన్ అనే భయం సాత్విక వీరవల్లి కళ్లలో ఎక్కడా కనిపించదు. ఆస్ట్రోనాట్ కావాలని కలలు కనే పల్లెటూరి అమ్మాయిగా ఒదిగిపోయింది. చాలా సన్నివేశాల్లో మాటల కన్నా కళ్లతోనే భావాలు పలికించింది. దుల్కర్, సాత్వికల జంట తెరపై చూడముచ్చటగా ఉంది, కథంతా ఎక్కువగా వీరిద్దరి చుట్టూనే తిరుగుతుంది. డేరింగ్ అండ్ డాషింగ్ మోడర్న్ అమ్మాయి రోహిణిగా శ్రుతి హాసన్ పాత్ర సెకండాఫ్‌కు కీలకంగా నిలిచింది.

రుహానీ శర్మ, స్వాసికలవి చిన్న పాత్రలే అయినా డీగ్లామర్ లుక్‌తో ఆకట్టుకున్నారు. మురళీ శర్మ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, ప్రవీణ్, కోట జయరాం తమ అనుభవంతో పాత్రలకు బలం చేకూర్చారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

ఈ సినిమాకు ప్రాణం పోసింది జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం. ఇందులో పాటలను, నేపథ్య సంగీతాన్ని వేరుగా చూడలేం. కథలో కలిసిపోయి, సన్నివేశాల భావోద్వేగాన్ని మరో మెట్టు ఎక్కిస్తాయి. సుజిత్ సారంగ్ విజువల్స్ కళ్లకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. పల్లె అందాలు, ఆకాశపు విశాలత్వం ఆయన కెమెరాలో అందంగా ఒదిగాయి. శ్వేత సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాగున్నాయి. పవన్ సాధినేని, గుణ్ణం గంగరాజు కలిసి రాసిన స్క్రీన్‌ప్లే సినిమాకు బలం. మాటలు సరళంగా ఉంటూనే మనసును తాకుతాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా నిండుగా ఉన్నాయి. మరోసారి తెలుగు సినిమా గురించి గర్వంగా మాట్లాడుకునేలా ఒక మంచి సినిమాను తెరకెక్కించారు దర్శకుడు.

బలాలు:
– స్ఫూర్తిదాయకమైన కథ
– భావోద్వేగాలు, మాటలు, సంగీతం
– దుల్కర్, సాత్విక జోడీ

బలహీనతలు:
– నెమ్మదిగా సాగే సన్నివేశాలు
– ముందే ఊహించగలిగే మలుపులు

ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే:

‘ఆకాశంలో ఒక తార’ ఒక నిజాయితీ గల, విభిన్నమైన ప్రయత్నం. అక్కడక్కడా తగ్గే వేగం, ముందే తెలిసిపోయే మలుపులు చిన్న లోపాలుగా అనిపించినా, ఈ సినిమా ఒక అందమైన భావోద్వేగ ప్రయాణంలా మనసుకు హత్తుకుంటుంది. కుటుంబమంతా కలిసి చూడదగిన హృద్యమైన చిత్రం ఇది. అవార్డులు రావడం పక్కా అనిపించే ఈ సినిమా, కమర్షియల్‌గా ఎంతవరకు నిలబడుతుందన్నదే అసలు ప్రశ్న.

రేటింగ్: 3.25/5

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

1 week ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

1 week ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

1 week ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 month ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.