Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా వైడ్‌గా పాపులారిటీని తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా భారీ చిత్రాల్లో ఆఫర్స్ వచ్చాయని చెప్పుకున్నారు. కానీ, ఎందుకనో ఆ సినిమాలను శ్రీనిధి ఒప్పుకోకుండా హ్యూజ్ రెమ్యునరేషన్ డిమాండ్ చేసి వదులుకుందని ప్రచారం కూడా జరిగింది.

అయితే, తెలుగులో అనుకోకుండా నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3లో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా ఆశించినంతగా కమర్షియల్ సక్సెస్ కలేదు. కానీ, సినిమాలో శ్రీనిధి పర్ఫార్మెన్స్ మాత్రం ఇటు తెలుగు ప్రేక్షకులను, అటు మేకర్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ సరసన తెలుసు కదా అనే సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించే అవకాశం అందుకుంది. కానీ, ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

will-aadarsha-kutumbam-bring-offers-in-tollywood-for-srinidhi

Srinidhi Shetty: ఈ కన్నడ బ్యూటీ చేతిలో ఉంది ఒక్క ఆదర్శ కుటుంబం సినిమా మాత్రమే. 

ఇప్పుడు, ఈ కన్నడ బ్యూటీ చేతిలో ఉంది ఒక్క ఆదర్శ కుటుంబం సినిమా మాత్రమే. విక్టరీ వెంకటేష్ సరసన ఆయన భార్య పాత్రలో నటించింది. ఇప్పటికే, ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ బాగానే బజ్ క్రియేట్ చేసింది. అక్టోబర్ 9న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో వెంకీ, త్రివిక్రమ్ లతో కలిసి శ్రీనిధి ఇంటర్వ్యూస్ ఇస్తోంది. అయితే, ఈ మధ్య కాలంలో వెంకీ సరసన నటించిన హీరోయిన్స్‌కి ఆ తర్వాత గొప్పగా చెప్పుకునే ఆఫర్సేవీ రాలేదు. ఇలాంటి, పరిస్థితుల్లో శ్రీనిధికి ఆదర్శ కుటుంబం తర్వాత తెలుగులో ఆఫర్స్ వస్తాయా లేదా అన్నది కాస్త డైలమాగానే ఉంది.

వాస్తవానికి, శ్రీనిధిలో అటు సీనియర్ హీరోలకి ఇటు యంగ్ హీరోలకి సరిపోయే ఫ్యూచర్స్ ఉన్నాయి. అందం, అభినయంలో కూడా ప్రశంసలు అందుకుంది. కానీ, ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే ఎవరికైనా అవకాశాలను తెచ్చిపెడతాయి. ఆ రకంగా చూస్తే ఇప్పుడు చేస్తున్న ఆదర్శ కుటుంబం హిట్ అవడం తప్పనిసరి. ఈ సినిమా హిట్ అవడంతో పాటు శ్రీనిధి పర్ఫార్మెన్స్‌కి మంచి పేరు..ప్రశంసలు దక్కాలి. అప్పుడే, తర్వాత సినిమాలలో ఛాన్స్ వస్తాయి. లేదంటే, త్వరగానే కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మరి, శ్రీనిధి శెట్టి ఫేట్ ఎలా ఉందో చూడాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 hours ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

3 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

3 weeks ago

This website uses cookies.