Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం, ఈ సినిమాకి సంబందించిన ప్రీ-ప్రొడక్షన్స్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు, ఈ వర్క్ కంప్లీట్ అయిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాని సరసన నటించబోయో హీరోయిన్‌ను పరిశీలిస్తున్నారట. ఇప్పటికే, సుజీత్ కొంతమంది పేర్లను నానీకి సూచించినట్టుగా తెలుస్తోంది.
ఢిల్లీలో నేపథ్యంగా ‘బ్లడీ రోమియో’:
సుజీత్ కి స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ సినిమాలను తెరకెక్కించడంలో మంచి పట్టుంది. ప్రభాస్‌తో తీసిన సాహో ఆ తర్వాత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాలను చూస్తే, ఈ విషయం అర్థమవుతుంది. హీరో ఎలివేషన్స్‌ని సుజీత్ అద్భుతంగా తెరకెక్కిస్తాడు. హాలీవుడ్ సినిమాలలో ఉండేటువంటి హై ఓల్టేజ్ ఛేజింగ్ సీన్స్, హెవీ అల్ట్రా స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్‌ని సుజీత్ బాగా చూపిస్తాడు. ఇప్పుడు, నాని హీరోగా రూపొందబోతున్న బ్లడీ రోమియో కూడా ఇలాంటి అల్ట్రా స్టైలిష్ గ్యాంగ్‌స్టర్, డార్క్ హ్యూమన్ ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. ఇక, బ్లడీ రోమియో ఫస్ట్ షెడ్యూల్ ఢిల్లీలో ప్లాన్ చేస్తున్నారట.
Tollywood: బ్లడీ రోమియోకి జూలియెట్ ఎవరు?
నాని సరసన ఈ సినిమాలో ఇప్పటికే, పలువురు క్రేజ్ ఉన్న గ్లామర్ బ్యూటీస్ పేర్లను పరిశీలించారట. ప్రధానంగా, ప్రియాంక అరుళ్ మోహన్ పేరు వినిపిస్తోంది. ఈ బ్యూటీ ఇప్పటికే నాని సరసన రెండు సినిమాలను చేసింది. తెలుగులో నాని నటించిన గ్యాంగ్ లీడర్ మూవీతోనే ప్రియాంక టాలీవుడ్‌కి పరిచయమైంది. ఆ తర్వాత, సరిపోదా శనివారం అనే సినిమాలోనూ నాని సరసన నటించింది. అంతేకాదు, సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమాలో పవన్ సరసన నటించింది. కాబట్టి, ఎక్కువగా ప్రియాంకకి ఛాన్స్ ఉంది.
ప్రియాంక అరుళ్ మోహన్ పేరు మాత్రమే కాకుండా..వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న మీనాక్షి చౌదరి పేరు కూడా నాని సినిమాకి పరిశీలనలో ఉంది. అలాగే, అనిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి, పూజా హెగ్డేల పేర్లు వార్తల్లో ఉన్నాయి. మరి, సుజీత్-నాని వీరిలో ఎవరిని ఫైనల్‌గా ప్రకటిస్తారో చుడాలి. ఇక, ది ప్యారడైజ్ సినిమాతో నాని మరోసారి మాస్ అండ్ యాక్షన్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
This website uses cookies.