TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌గా ఉన్న కీలక నేతకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి శుభాకాంక్షలు రాకపోవడం విస్మయం కలిగిస్తోంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ వంటి అగ్రనేతలు ఎవరూ ‘ఎక్స్’ వేదికగా కూడా విషెస్ తెలపకపోవడం గమనార్హం.
మరోవైపు స్వపక్షం మౌనంగా ఉంటే, విపక్ష ఎన్డీఏ కూటమి నేతలు మాత్రం రేవంత్ రెడ్డికి బర్త్‌డే విషెస్‌లో పోటీ పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ట్వీట్ చేయడమే కాకుండా ప్రత్యేకంగా అధికారిక లేఖ రాశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వంటి ప్రముఖులు శుభాకాంక్షలు తెలపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
TS POLITICS: కాంగ్రెస్ హైకమాండ్ ఇంతటి మౌనం వెనుక అసలు కారణమేంటి?
కాంగ్రెస్ హైకమాండ్ ఇంతటి మౌనం వెనుక అసలు కారణమేంటి? అనేదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతల మధ్య ఉన్న వర్గపోరు, అసంతృప్తిని చల్లార్చేందుకు అధిష్టానం ఈ వ్యూహాత్మక మౌనాన్ని ఎంచుకుందనే వాదన ఉంది. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీతో రేవంత్ రెడ్డికి ఉన్న సత్సంబంధాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో ఆయన సమన్వయం చేసుకునే తీరుపై జాతీయ స్థాయిలో కొన్ని వర్గాల్లో భిన్నమైన చర్చ జరుగుతోంది. ఎన్డీఏ నేతలు ఈ స్థాయిలో స్పందించిన తరుణంలో, కాంగ్రెస్ అధిష్టానం కావాలనే ఒక పొలిటికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అయితే, జాతీయ స్థాయిలో ఇలాంటి రాజకీయ చర్చలు నడుస్తున్నప్పటికీ… రేవంత్ రెడ్డి మాత్రం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో చాలా సాదాసీదాగా బర్త్‌డే వేడుకలు జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి, మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఆనందంగా గడపడం ద్వారా తాను ఎప్పుడూ ప్రజల మనుషినే అనే సంకేతాన్ని క్షేత్రస్థాయిలో పంపారు. మొత్తానికి ఈ అధికారిక శుభాకాంక్షల గైర్హాజరీపై ఎలాంటి స్పష్టత లేనప్పటికీ, కాంగ్రెస్ అగ్రనేతల ఈ సైలెన్స్ మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మరి ఇది కేవలం యాదృచ్ఛికమా లేక రాబోయే పరిణామాలకు సంకేతమా అనేది రానున్న కాలమే తేల్చాలి.
Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…
AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…
NATS: అమెరికాలోని షార్లెట్ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…
Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
This website uses cookies.