Categories: LatestMost ReadNews

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల ను నియమించింది. నాట్స్ ఛైర్మన్ కిశోర్ కంచర్ల పాల్గొన్న ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ ఈ నియామకాన్ని ప్రకటించారు.

న్యూజెర్సీకి చెందిన నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ మాట్లాడుతూ, యువకుడు, ఉత్సాహవంతుడు, చురుకైన నాయకుడైన సాయి గంగులకు సామాజిక సేవ పట్ల ఉన్న అంకితభావం న్యూజెర్సీ వ్యాప్తంగా నాట్స్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువతను నాట్స్ సేవా కార్యక్రమాల్లో మరింతగా భాగస్వాములను చేయడంలో సాయి గంగుల కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

నాట్స్ ఛైర్మన్ కిశోర్ కంచర్ల మాట్లాడుతూ, నాట్స్ అభివృద్ధిలో న్యూజెర్సీ తెలుగు సమాజం అందించిన విశేష సేవలను కొనియాడారు. న్యూజెర్సీ నుంచి ముగ్గురు నాట్స్ అధ్యక్షులు రావడం ఈ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకతను చాటుతోందని పేర్కొన్నారు. తెలుగు సమాజానికి మరింత చేరువవుతూ, సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడానికి నాట్స్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

sai-gangula-appointed-as-chapter-leader-nats-telugu-community-in-new-jersey

ఈ సమావేశంలో పలువురు ప్రముఖ తెలుగు సంఘాల నాయకులు, నాట్స్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆప్టా (APTA), ఆత్మీయ (ATMIYA), మాటా (MATA), తానా (TANA), టీఫాస్ (TFAS), ఎన్‌ఆర్‌ఐవీఏ (NRIVA) సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు సంఘాల మధ్య ఐక్యత, పరస్పర సహకారం, సమాజ సేవ పట్ల ఉమ్మడి నిబద్ధతకు ఈ సమావేశం వేదికగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు సభ్యులు బిందు యలమంచిలి, టీపీ రావు, శ్యామ్ నాళం, మురళీకృష్ణ మేడిచెర్ల, శ్రీనివాస్ భీమినేని, వంశీ కొప్పురావూరి పాల్గొన్నారు.

అలాగే నాట్స్ జాతీయ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న నెక్సిల్లో హెల్త్ (Nexillo Health) సంస్థకు చెందిన శశి పర్వతం, బులియన్ ఫార్చ్యూన్ (Bullion Fortune) సంస్థకు చెందిన కల్యాణ్ లక్కింశెట్టి, వంశీకృష్ణ కొప్పురావూరి కూడా ఈ కార్యక్రమానికి హాజరై నాట్స్ సేవా కార్యక్రమాలకు తమ మద్దతును తెలియజేశారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ కు అభినందనలు తెలియజేశారు. ఆయన అంకితభావంతో అందిస్తున్న సేవలను, నాయకత్వాన్ని ప్రశంసించారు. తెలుగు సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని రాజ్ అల్లాడ నొక్కిచెప్పారు. క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు, క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాల్లో నాట్స్‌తో కలిసి పనిచేయాలని తెలుగు సంఘాలకు పిలుపునిచ్చారు.

తెలుగు సమాజంలో పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేయడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను విస్తరించడం వంటి నాట్స్ లక్ష్యాలను ఈ సమావేశం మరోసారి చాటిచెప్పింది.

న్యూజెర్సీ వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలు నాట్స్ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, కమ్యూనిటీ కార్యకలాపాలు, స్వచ్ఛంద సేవా అవకాశాల కోసం నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ లీడర్ సాయి గంగులను సంప్రదించవచ్చు మరియు పీఆర్వో (PRO) జీకే మీడియా గణేష్ – కుమార్.

సంప్రదించాల్సిన ఈమెయిల్: natsnj@natsworld.org   

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

2 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 month ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 month ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 months ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 months ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

2 months ago

This website uses cookies.