Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న రిలీజ్ కాబోతోంది. కానీ, ఈ విషయాన్ని స్వయంగా హీరో రామ్ చరణ్ చెప్పినా కూడా ఫ్యాన్స్ నమ్మడం లేదు. దీనికి కారణం ఆల్రెడీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ కావడమే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
పెద్ది సినిమా ప్రారంభమైనప్పుడు అంచనాలున్నప్పటికీ, ఈ రేంజ్‌లో పెరుగుతాయని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఎప్పుడైతే పెద్ది ఫస్ట్ లుక్ అండ్ ఫస్ట్ షాట్ వదిలారో.. అప్పుడు ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక, చికిరి చికిరి సాంగ్ తర్వాత ఇదేదో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్ఠించే సినిమానే.. అని మాట్లాడుకోవడం మెదలుపెట్టారు. రామ్ చరణ్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్న విషయం కూడా మొన్నటి వరకూ దర్శకుడు బుచ్చిబాబు సీక్రెట్ గా ఉంచాడు.
ఇటీవల వచ్చిన టీజర్‌తో, ఇందులో చరణ్ పోషిస్తున్నది రెండు పాత్రలని క్లారిటీ వచ్చింది. అప్పటి నుంచి అభిమానుల్లోనే కాకుండా.. ఫిల్మ్ సర్కిల్స్‌లో, సినీ ప్రేమికుల్లో సిల్వర్ స్క్రీన్ మీద పెద్ది ప్రభంజనం చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. వాస్తవానికి, మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు పెద్ది చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ గట్టిగానే ప్రయత్నించారు. కానీ, కొన్ని పనులు పూర్తికాకపోవడంతో ఏప్రిల్ చివరికి వాయిదా వేశారు. అయితే, ఇటీవల ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో నేరుగా చరణ్‌ని అభిమానులు పెద్ది రిలీజ్ గురించి అడిగారు.
దానికి సమాధానంగా చరణ్ ఖచ్చితంగా ఏప్రిల్ 30న మీ ముందుకు వస్తుందని హామీ ఇచ్చారు. కానీ, ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇంకా పెద్ది చిత్రానికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదట. ఇదే, అభిమానులకి చేరి పలు సందేహాలు కలుగుతున్నాయి. మళ్ళీ, పెద్ది పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని, జూన్ నెలలో రిలీజ్ ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఇది, ఏప్రిల్ నెల ప్రారంభమే కాబట్టి, మరో వారం పది రోజుల్లో మేకర్స్ నుంచి పెద్ది రిలీజ్ విషయంలో కన్‌ఫర్మేషన్ రావచ్చు. ప్రమోషన్స్ మొదలయ్యేదాన్ని బట్టి అందరూ పెద్ది వచ్చేది ఇదే నెలలోనా లేక మరోసారి పోస్ట్ పోన్ అవుతుందా..అనేది తేలిపోతుంది.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.