Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న మెగా హీరోలందరికీ పూల బాట వేసింది చిరు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క హీరో ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలను కూడా తన ఇష్టాలుగా పేర్చుకొని నిలబడితే, అదే ఆలయశిఖరం అవుతుంది..ఆయనే ఒక విజేత అవుతాడు..ఆయనే మనశంకరవరప్రసాదూ అవుతాడు. చిరంజీవి అంటే ఒక ప్రయాణం..చిరంజీవి అంటే ఒక ప్రస్థానం..చిరంజీవి అంటే అక్షరాలు సరిపోని పుస్తకాల సంగమం.

చిరంజీవి నటనలో దేవదాస్ కనకాల వద్ద శిక్షణ తీసుకున్నారు. కానీ, ఆ తర్వాత జనరేషన్ హీరోలందరూ ఆయన సినిమాలు..ఆయన నటన చూసే స్టార్స్ అయ్యారంటే ఒప్పుకోనివారుండరు. పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నా, అంజనా ప్రొడక్షన్స్ స్థాపించి నాగబాబు నిర్మాతగా విజయాలందుకున్నా, చిరుతతో హీరోగా పరిచయమై పాన్ ఇండియా స్టార్ గా ఓ వెలిగుతున్న రామ్ చరణ్ అయినా..మిగతా మెగా హీరోలే కాకుండా ఆయన ఇంట్లో పెరిగి పెద్దై ఇప్పుడు హీరోలుగా నిలబడ్డ చాలామంది కథానాయకుల ముందు ఉంది మన మెగాస్టారే. ఆయన స్వయంకృషే.

చిరంజీవిగా పరిచయమై.. మెగాస్టార్‌గా పాపులరై.. అందరివాడిలా ఇండస్ట్రీలో అందరికీ తన సహాయ సహకారాలు, అండదండలు అందిస్తూ ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలా చక చకా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలలో విశ్వంభర, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా ఉన్నాయి. వీరితో పాటు సీనియర్ దర్శకుడు వి.వి.వినాయక్ కూడా చిరును డైరెక్ట్ చేసేందుకు కథలు వింటున్నాడు. మరికొందరు యువ దర్శకులు అన్నయ్యకి యాక్షన్-కట్ చెప్పడానికి స్క్రిప్టులతో సిద్ధంగా ఉన్నారు.

chiranjeevi-vishwambhara-is-delayed-even-more-will-it-be-like-that-movie

Chiranjeevi: ‘విశ్వంభర’ ఆలయస్యం ‘అంజి’ సినిమాతో పోలిక ఎందుకు?

బింబిసార సినిమాతో దర్శకుడిగా మారాడు ఒకప్పటి నటుడు మల్లిడి వశిష్ఠ. హీరో అవ్వాలనుకొని వచ్చి దర్శకుడిగా మొదటి సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీ హిట్ అయితే, ఆ దర్శకుడిని సన్మానించి అవకాశం ఇవ్వడం మెగాస్టార్ కి అలవాటు. అలా అవకాశం అందుకున్న మల్లిడి వశిష్ట భారీ స్థాయిలో సోషియోఫాంటసీ చిత్రంగా విశ్వంభరను మొదలుపెట్టాడు. ఏడాదిక్రితమే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇంకా, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌లోనే ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. చాలామంది ఇండస్ట్రీలో ఉన్నవారు.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంజి సినిమాతో పోల్చుకుంటున్నారు.

అంటే, ఆ సినిమాలా ఇంకా నాలుగేళ్ళు పడుతుందనా లేక కంప్యూటర్ గ్రాఫిక్స్ సెట్ అవక ప్రేక్షకులను డిసప్పాయింట్ చేస్తుందనా.. అంటే అన్నయ్య హీరో కాబట్టి, ఏ ఒక్కరూ కామెంట్ చేయడానికి వీల్లేదు. వాస్తవానికి, ఈ మూవీ కోసం చిరు ఎంతో శ్రమించారు. చాలా ఏళ్ళ తర్వాత త్రిష కి కంబ్యాక్ మూవీ. మన మెగాస్టార్ విశ్వంభర తో పాటు ప్రకటించిన సినిమాలన్నీ రిలీజైపోయాయి. కానీ, ఈ సినిమా విషయంలో మేకర్స్ నుంచి క్లారిటీ రావడం లేదు. అభిమానులు మాత్రం ఎంతో ఊహించుకుంటున్నారు. మరి, ఆ ఊహలకి మించి విశ్వంభర ఉంటుందా? అనేది తెలియాలంటే ఎంత ఆలస్యం అయినా సినిమా థియోటర్స్ కి వచ్చేదాకా ఆతృతగా ఎదురుచూడాల్సిందే.

 

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.