Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో సహజత్వం ఉంటే ఖచ్చితంగా ఆ సినిమా ప్రతీ ప్రేక్షకుడికీ చేరుతుంది. అలా చేరిన సినిమాలెన్నో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్ఠించాయి. అవార్డులు, రివార్డులు దక్కించుకున్నాయి. ఒక భాషలో హిట్ సాధించిన సినిమాను ఒకప్పుడు ఇతర భాషల్లో రీమేక్ చేసి విజయాలను అందుకున్నారు..పరాజయాలను చూశారు. ఈ అనుభవం ప్రతీ హీరో, దర్శక-నిర్మాతకి జరిగింది.

మన సినిమా ఇండస్ట్రీలో కొందరు మేకర్స్..హీరోలు అంటుంటారు.. ఒకప్పటి క్లాసిక్స్ ని టచ్ చేయకపోవడం బెటర్ అని. కొన్ని సినిమాల ఫలితం చూస్తే ఒప్పుకొని తీరాల్సిందే. ఇప్పుడు సౌత్‌లో ఉన్న నాలుగు ప్రధాన భాషల్లో పాన్ ఇండియా స్కేల్ సినిమాలే రూపొందుతున్నాయి. కొన్ని సినిమాలను హై టెక్నికల్ వ్యాల్యూస్, సైన్ ఫిక్షన్ జానర్‌లో నిర్మిస్తుండగా, పెద్ది లాంటి సినిమాలను 1980 కాలం నాటి పరిస్థితుల ఆధారంగా పూర్తి స్థాయి సహజమైన కథాంశంతో రూపొందిస్తున్నారు. ఇలాంటి, సాహసం చేసి సక్సెస్ అయిన దర్శకుడు సుకుమార్. ఆ సినిమాలే రంగస్థలం, పుష్ప సిరీస్.

ram-charan-were-aamir-khans-films-the-inspiration-for-the-story-of-peddi

Ram Charan: లగాన్, దంగల్ సినిమాల తరహాలో చరణ్ పాత్రలు.!

అయితే, పెద్ది సినిమా నుంచి ఇప్పటి వరకూ వచ్చిన కంటెంట్ చూస్తుంటే బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన రెండు సినిమాల ఛాయలు కనిపిస్తున్నాయి. ఆ సినిమాలే లగాన్, దంగల్. పెద్ది మూవీ ఫస్ట్ షాట్ గ్లింప్స్ చూస్తే లగాన్ తరహాలో ఆ పాత్ర ఉండేలా కనిపిస్తోంది. ఇక, ఇటీవల రిలీజ్ చేసిన పహిల్వాన్ పాత్ర చూసుకుంటే దంగల్ సినిమాలో పాత్ర తరహాలో కనిపిస్తోంది. బుచ్చిబాబు ఈ రెండు పాత్రలను ఎంతో పవర్ ఫుల్‌గా తీర్చి దిద్దినట్టుగా చెబుతున్నాడు. అంతేకాదు, తను రాసుకున్న కథ..చరణ్ పాత్రలు స్క్రిప్ట్ దశలోనే హిట్ అయిపోయాయని ఎంతో నమ్మకంగా చెబుతున్నాడు.

అప్పట్లో లగాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్ఠించిన సునామీ, ఆ తర్వాత మహావీర్ సింగ్ ఫోగాట్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన దంగల్ ఏ స్థాయిలో సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరకంగా, మన సౌత్‌లో స్పోర్ట్స్ డ్రామాలు తెరకెక్కుతున్నాయంటే షారుఖ్ ఖాన్ నటించిన చక్ దే ఇండియా లాంటి సినిమాలే ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. లేడీ డైనమిక్ డైరెక్టర్ సుధ కొంగర మూడు భాషల్లో రూపొందించిన గురు ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఆర్.మాధవన్, విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో ఈ సినిమా ఓ మైల్ స్టోన్. అలాంటి, సినిమాను పెద్ది ద్వారా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి బుచ్చిబాబు ఇవ్వబోతున్నాడని చెప్పుకుంటున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

6 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

6 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.