Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ ఉంటారు. యాపిల్ లో ఎన్నో పోషక విలువలు ఉండటం వల్ల ప్రతిరోజు ఒకటి తీసుకుంటే ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని భావిస్తుంటారు. అయితే ఆపిల్ తినడం కంటే కూడా ఏ సమయంలో తింటే అందులో ఉన్న పోషకాలు మన శరీరానికి అందుతాయి అనేది ముఖ్యం. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు ఆపిల్ తినకూడదని ముఖ్యంగా రాత్రిపూట ఆపిల్ తినడం మంచిది కాదు నేను ఇప్పుడు నన్ను చెబుతున్నారు.యాపిల్‌లో ఫైబర్, విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.
యాపిల్‌లో సహజంగా ఉండే ఫ్రక్టోజ్ కారణంగా కొంతమందికి రాత్రివేళ తిన్న తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. అయితే పడుకునే సమయానికి చాలా దగ్గరగా యాపిల్ తింటే, సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. అందుకే నిద్రకు కనీసం 1–2 గంటల ముందు తినడం మంచిది.అయితే యాపిల్ తినడం వల్ల నిద్ర నేరుగా మెరుగుపడుతుందని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు.
రాత్రి సమయంలో తీపి పదార్థాలు, అధిక కేలరీల స్నాక్స్ బదులుగా ఒక యాపిల్‌ను ఎంచుకోవడం మాత్రం మెరుగైన ఆహార ఎంపిక కావచ్చు. యాపిల్‌ను తొక్కతో సహా తింటే ఫైబర్ మరింతగా లభిస్తుంది.మొత్తంగా చూస్తే, పడుకునే ముందు యాపిల్ తినడం చాలామందికి సురక్షితమైన, పోషకమైన ఎంపిక. అయితే మధుమేహం, యాపిల్ తిన్నప్పుడు జీర్ణ సమస్యలు లేదా ఇతర ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు తమ ఆహారంలో ఎంత మోతాదులో తీసుకోవాలో వైద్యుడు లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది. ఇక రాత్రి పడుకోవడానికి ముందుకంటే కూడా ఉదయం అల్పాహారం తిన్న తర్వాత ఆపిల్ తీసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
NATS: అమెరికాలోని షార్లెట్ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…
Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
This website uses cookies.