Categories: DevotionalLatestNews

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి వారి దర్శనం కోసం దేశ విదేశాలనుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఇలా స్వామివారిని దర్శించుకున్న అనంతరం మొక్కలు చెల్లించుకుంటూ పెద్ద ఎత్తున కానుకలను సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం తిరుమల వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం రికార్డ్ స్థాయిలో నమోదైనట్టు తెలుస్తుంది. గురువారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు స్వామివారి హుండీ కానుకులను లెక్కించారు.

బుధవారం ఒక్కరోజు స్వామి వారి హుండీ ద్వారా కానుకల రూపంలో రూ.6.93 కోట్ల రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలియచేశారు. తిరుమల ఆలయ చరిత్రలో ఒక రోజులోనే ఇలా హుండీ ఆదాయం ఆరు కోట్ల పైగా రావడం ఇది మూడోసారి. బుధవారం కొంతమంది అజ్ఞాత భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించిన నేపథ్యంలో ఈ స్థాయిలో హుండీ కానుకలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇక స్వామివారి దర్శనం విషయానికి వస్తే.. శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది సర్వదర్శనం కోసం 24 గంటల పాటు సమయం పడుతుంది అదే విధంగా ఈ వారాంతంలో వరుసగా సెలవులు వస్తున్న నేపథ్యంలో కొండపై భక్తుల రద్దీ కూడా పెరుగుతుంది.

Record breaking hundi income for lord Venkateswara at tirumala and vip break darshan cancelled at sunday

Tirumala Hundi: ఆదివారం విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..

ఇలా కొండపైకి భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆదివారం స్వామివారి విఐపి బ్రేక్ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ విషయాన్ని గుర్తించి భక్తులు తిరుమలకు వెళ్లాలని తెలిపారు. ఇలా ఆదివారం విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన నేపథ్యంలో శనివారం భక్తుల నుంచి ఎలాంటి సిఫార్సులను తీసుకోవడం లేదు. ఇక వరుసగా మూడు రోజులు సెలవులతో పాటు సెప్టెంబర్ 15 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో  కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుందని చెప్పాలి.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 day ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 day ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

4 weeks ago

This website uses cookies.