Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున ప్రారంభిస్తూ ఉంటారు కొంతమంది ఉదయం నిద్ర లేవగానే నీటిని తాగి యోగ వంటివి చేస్తూ ఉంటారు మరి కొందరు లేచిన వెంటనే కాఫీ టీ తాగుతూ వారి పనులను ప్రారంభిస్తూ ఉంటారు ఇలా ఎవరికి అనుగుణంగా వారు రోజును ప్రారంభిస్తూ ఉంటారు.. అయితే మనం ఉదయం నిద్ర లేవగానే కొన్ని చేసే పనులు మన ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం లేచిన తర్వాత ఈ ఐదు పనులు చేయటం వల్ల మన కిడ్నీ ప్రమాదంలో పడినట్లేనని హెచ్చరిస్తున్నారు.
ఉదయం లేవగానే ఎలాంటి తప్పులు చేయకూడదు అనే విషయానికి వస్తే..చాలామంది రాత్రి పడుకున్న తర్వాత ఉదయం నిద్రలేచేవరకు అసలు కదలరు. మధ్యలో నీటిని తాగడానికి కూడా ఇష్టపడరు. ఇలా చేయటం వల్ల మన శరీరం పూర్తిగా డీహైడ్రేషన్ అవుతుంది. ఇలా డిహైడ్రేషన్ అయిన శరీరానికి ఉదయం నిద్ర లేవగానే కాఫీ లేదా టీ వంటివి తాగటం వల్ల కిడ్నీ పని తీరు పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది .మన శరీరానికి తగినంత నీరు లేకపోవడంతో కిడ్నీ పనితీరు తగ్గుతుంది అలాంటి సమయంలో నీటికి బదులుగా కాఫీకి తాగటం వల్ల కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుంది .
ఉదయం నిద్ర లేవగానే చాలామంది వారి పనులలో బిజీ అవుతూ మూత్రం వస్తున్నప్పటికీ ఆపుకుంటూ ఉంటారు ఇలా చేయడం అనేది కిడ్నీ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసినట్టేనని నిపుణులు చెబుతున్నారు. ఇక చాలామంది శరీర నొప్పులు కారణంగా ఉదయం లేవగానే ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా మందులు వాడుతూ ఉంటారు ఇలా పరగడుపున నొప్పికి సంబంధించిన మందులు వేసుకోవటం అనేది కిడ్నీ ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక చాలామంది వర్క్ ఔట్ చేసిన తర్వాత నీరు తాగడానికి ఇష్టపడరు కానీ ఖచ్చితంగా నీటిని తీసుకోవాలని లేకపోతే మన శరీరం డిహైడ్రేషన్ కారణంగా కిడ్నీ పనితీరు కూడా తగ్గుతుందని డాక్టర్లు. ఇలా ఈ అలవాట్లు ఉంటే మన కిడ్నీని పూర్తి ప్రమాదంలోకి నెట్టేస్తున్నామని ఈ అలవాటును మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
రు.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…
This website uses cookies.