ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర బృందం. అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8వ తేదీ. ఈ సందర్భంగా తమిళ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్ ఫిక్షన్ సినిమా టైటిల్ ని ప్రకటించబోతున్నట్టుగా మేకర్స్ కొన్ని గంటల క్రితం అప్‌డేట్ ఇచ్చారు. దీనికి సంబందించిన ప్రీ లుక్ ను కూడా రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక, నేడు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దాదాపు 700 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సినిమా టైటిల్ ‘రాకా’ అంటూ ప్రకటించారు. దీనికి అర్థం చంద్రుడు అని. అంతేకాదు, టైటిల్ పోస్టర్ తో పాటుగా అల్లు అర్జున్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. పునర్జనల నేపథ్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దర్శకుడు అట్లీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన లుక్ చూసినట్లైతే ఇందులో అల్లు అర్జున్ అరగుండుతో కనిపిస్తున్నాడు. ఒకరకంగా, ఇది విలనిజాన్ని తలపిస్తోంది.

allu-arjun-aa22-aa22-title-is-raaka-this-is-something-no-one-expected

ALLU ARJUN: మనిషి రూపంలో ఉన్న ఓ రాక్షసుడు మాదిరిగా పొడవాటి గోర్లతో అల్లు అర్జున్ లుక్ మైండ్ బ్లోయింగ్

మనిషి రూపంలో ఉన్న ఓ రాక్షసుడు మాదిరిగా పొడవాటి గోర్లతో అల్లు అర్జున్ లుక్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. ఓ హాలీవుడ్ మూవీ పోస్టర్ కి ఏమాత్రం తగ్గని విధంగా డిజైన్ చేసినట్టుగా అర్థమవుతోంది. మరి, అట్లీ ఈ మూవీని ఏ రకంగా తయారు చేస్తున్నాడో ఎవరి ఊహకి అందడం లేదు. శంకర్ రూపొందించిన ఐ మూవీలోని విక్రం లుక్ తరహా కాస్త పోలికలైతే ఉన్నాయి. ఇప్పటికే, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దీపిక పడుకోణ్ హీరోయిన్‌గా.. రష్మిక మందన్న, మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్ ఇతర పాత్రల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.

అధికారికంగా ఇప్పటి వరకూ కన్‌ఫర్మ్ అయింది ఒక్క దీపిక పడుకోణ్ మాత్రమే. ఇప్పటికే, నెట్‌ఫ్లిక్స్ వారు అదిరిపోయే డిజిటల్ రైట్స్ కి సొంతం చేసుకున్నారు. పుష్ప ఫ్రాంఛైజీస్ తో గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ తెచ్చుకున్న అల్లు అర్జున్ రాకా తో హాలీవుడ్ హీరోల సరసన చేరడం ఖాయమనిపిస్తోంది. చూడాలి, మరి టాలెంటెడ్ డైరెక్టర్‌గా కోలీవుడ్, బాలీవుడ్ లో పేరు సంపాదించుకున్న అట్లీ మన ఐకాన్ స్టార్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తాడో.

 

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.