Prabhas-Spirit: సందీప్ రెడ్డి వంగ రేంజ్‌ ఇది..

Prabhas-Spirit: ప్రస్తుతం మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న సినిమా స్పిరిట్. కాప్ స్టోరీగా తెరకెక్కుతోంది. ప్రభాస్ కటౌట్ కి తగ్గట్టుగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే అంచనాలు ఊహించని రేంజ్‌కి చేరుకున్నాయి. హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ నటిస్తున్న సంగతీ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే క్రేజ్ మొదలైంది. హీరోయిన్ ని ఫిక్స్ చేయడం..ఇద్దరి ఫస్ట్ లుక్ వదలడంతో మరోసారి సందీప్ రెడ్డి తన మార్క్ మూవీని తీసుకురాబోతున్నాడని చెప్పుకుంటున్నారు.

ప్రభాస్-సందీప్ రెడ్డి కాంబోకున్న క్రేజ్ ఇది:

దర్శకుడిగా స్ట్రైట్ సినిమాల నంబర్ చూసుకుంటే సందీప్ రెడ్డి వంగ లిస్ట్ లో స్పిరిట్ మూడవ చిత్రమే. విజయ్ దేవరకొండతో చేసిన మొదటి సినిమా అర్జున్ రెడ్డి ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇదే సినిమాను హీందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్ లో ఓ బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక,యానిమల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. దీంతో, సందీప్ రెడ్డి వంగా సౌత్, నార్త్ లో ఉన్న టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు.

prabhas-spirit-this-is-the-sandeep-reddy-vanga-range

Prabhas-Spirit: రూ.250 కోట్లకి డిజిటల్ రైట్స్.!

ఈ క్రేజ్‌తో ప్రభాస్ ని డైరెక్ట్ చేయనున్నాడనగానే బిజినెస్ పరంగా ఊహించని రీతిలో ఆఫర్స్ వచ్చి పడ్డాయి. తాజాగా, ఫిల్మ్ సర్కిల్స్‌లో సర్క్యులేట్ అవుతున్న వార్తల ప్రకారం ప్రభాస్,సందీప్ రెడ్డి వంగల క్రేజ్ తో స్పిరిట్ మూవీ ఓటీటీ డీల్ భారీ స్థాయిలో జరిగినట్టుగా తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వారు ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని ఏకంగా రూ.250 కోట్లకి దక్కించుకున్నట్టుగా సమాచారం. బాహుబలి, సాహో, రాధే శ్యామ్, సలార్, కల్కి, ది రాజాసాబ్ సినిమాలతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో సందడి చేశాడో అందరికీ తెలిసిందే.

సినిమా ఫ్లాపైనా ప్రభాస్ రేంజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ప్రస్తుతం ఫౌజీ, సలార్ 2, కల్కి 2, స్పిరిట్ చేస్తుండగా, సందీప్ రెడ్డి మేకింగ్ స్టైల్ కి ప్రపంచవ్యాప్తంగా ఆయన సినిమాకున్న క్రేజ్ కి డిజిటల్ రైట్స్ ఊహించని విధంగా జరిగిందని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇంకా థియేట్రికల్ బిజినెస్, శాటిలైట్ బిజినెస్ ఏ రేంజ్ లో జరగబోతుందో చెప్పడానికి మాటలు సరిపోవు. ఇక, డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు స్పిరిట్ మూవీ అప్‌డేట్స్ వస్తాయా..ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లో చూస్తామా..అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి, సందీప్ రెడ్డి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు స్పిరిట్ మూవీని తీసుకువస్తాడో చూడాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

3 days ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

3 days ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

4 days ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

4 days ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

5 days ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

5 days ago

This website uses cookies.